జాతీయ వార్తలు

భారత్‌కు క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు ఉన్మాదంగా కాల్పులు జరుపుతూ ఎంతోమంది పౌరులను క్షతగాత్రులుగా మారుస్తున్నారని, ఈ విషయాలను గమనించైనా పాక్ మద్దతుదారులు భారత్‌కు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఉచ్చులో పడుతున్నవారు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాశ్మీర్ సమస్యను కేంద్ర బిందువుగా చేసుకుని వీరంతా పాక్‌కు వంతపాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, గ్రామాల్లోని అమాయక పౌరులపై పాక్ సైనికులు దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. పలు సంఘటనల్లో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కేంద్ర మంత్రి పరామర్శించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా పాక్ సైనికులు దాడులు చేస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని అన్నారు.

చిత్రం..పాక్ కాల్పుల్లో గాయపడ్డ క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్