జాతీయ వార్తలు

మీరు ఎవరికీ తీసిపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన 112 మంది మహిళలు శనివారం ఇక్కడ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. రాష్టప్రతిని కలిసేందుకు అత్యంత ప్రముఖులతో పాటు ఓ మహిళా కూలీకి కూడా అవకాశం దక్కింది. కళలు, సాహిత్యం, టెక్నాలజీ, వాణిజ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో విజేతలుగా నిలిచిన మహిళలు రాష్టప్రతి భవన్‌కు చేరుకుని కోవింద్‌ను కలిశారు. ప్రముఖ సినీ నటి ఐశ్వర్య బచ్చన్, క్షిపణి శాస్తవ్రేత్త టెస్సీ థామస్, పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్, క్రీడాకారిణి దీపా మాలిక్ వంటి ప్రముఖులు రాష్టప్రతిని కలుసుకున్నారు. జైపూర్ (రాజస్థాన్) రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పనిచేస్తున్న మంజు ఈ ‘మహిళా విజేతల బృందం’లో ఉండడం విశేషం. భర్త మరణంతో కుటుంబాన్ని పోషించేందుకు తాను పోర్టర్‌గా మారానని ఆమె రాష్టప్రతి సమక్షంలో మాట్లాడుతూ చెప్పింది. రైల్వే స్టేషన్లలో మహిళా కూలీలకు అవకాశం లేదని తొలుత అధికారులు చెప్పారని, అయితే తాను పట్టుబట్టి తన భర్త పనిచేసినట్లే పోర్టర్‌గా చేరానని వివరించింది. తన బాధలను అర్థం చేసుకున్న అధికారులు చివరికి పోర్టర్‌గా చేరేందుకు 2013లో అనుమతించారని తెలిపింది. మంజూ చెప్పిన విషయాలను విన్న అనంతరం రాష్టప్రతి మాట్లాడుతూ, పట్టుదల ఉంటే ఎవరైనా విజేతలుగా మారవచ్చని అన్నారు. ఇలాంటి విజయగాథలు దేశంలోని మిగతా మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. అవకాశాలు కల్పిస్తే మహిళలు సైతం అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా పనిచేస్తారని ఆయన అన్నారు. పనిచేసే చోట మహిళలకు భద్రత కల్పించాలన్నారు.

చిత్రాలు.. సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్. *మంజు అనే రోజువారీ కూలీ * ‘ఫస్ట్ లేడీస్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మహిళా కేంద్ర మంత్రులు అనుప్రియా పటేల్, మేనకాగాంధీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్.