జాతీయ వార్తలు

బీజేపీ ఓ సిద్ధాంతం.. ఓ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, జనవరి 20: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటువేసే యువతను తమవైపుతిప్పుకునే దిశగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పావులు కదుపుతున్నారు. ప్రధాని మోదీ పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసి నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నారు. శనివారం ఇక్కడ యువ ఉద్ఘోష్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్‌షా మహాత్మాగాంధీ క్రీడామైదానంలో యువతను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీకి విధేయంగా ఉండడం అంటే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం కాదని ఓ సిద్ధాంత, ఓ ఉద్యమానికి, నవ భారతాన్ని నిర్మించాలన్న ఓ ప్రతిజ్ఞకు కట్టుబడడమేనని షా అన్నారు. బీజేపీ కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ప్రధాని మోదీ సారధ్యంలో నవభారత నిర్మాణానికి అకుంఠిత దీక్షతో ఓ సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ అని ఆయన అన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ హాజరైన ఈ కార్యక్రమం ద్వారా 17 ఏళ్లు నిండిన యువతీయువకులను బీజేపీ సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా పార్టీ హైకమాండ్ పనిచేస్తోంది. ఈ సందర్భంగా విపక్షాలపై పరోక్ష విమర్శలు గుప్పించిన అమిత్‌షా‘ మా పార్టీ కుల, కుటుంబ నేపథ్యంలో పనిచేసేది కాదు. ఇది పూర్తిగా కార్యకర్తలతో కూడుకున్న పార్టీ’అని స్పష్టం చేశారు. బీజేపీలో బూత్ స్థాయి కార్యకర్తగా తాను పనిచేసిన రోజులను షా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ స్థాయి నుంచి తాను పార్టీ అధ్యక్షుడిగా ఎదిగానని అలాగే ఒకప్పుడు టీలు అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. అయితే ఇతర పార్టీలు పూర్తిగా కుటుంబాల ఆధిపత్యంలో పనిచేసేవని ఆయా కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఉన్నత పదవులను ఈ పార్టీలో పొందుతారని ఆయన చెప్పారు. ట్రిపుల్ తలాక్ విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షించారు.