జాతీయ వార్తలు

ఇంజక్షన్ వికటించి నాలుగేళ్ల చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: రాజధాని ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఓ విషాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారికి పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇస్తే వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. బాలిక పై పెదవి గాయం మూలంగా కుట్టువేశారు. అయితే ఆ బాధనుంచి ఉపశమనం కోసం ఇంజక్షన్ ఇచ్చారు. అదికాస్తా వికటించి బాలిక మరణించింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రోహిణీ ప్రాంతంలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఈనెల 17న బాలికను చేర్చారు. ఆమె పై పెదవి తెగడంతో ఆసుపత్రిలో చేర్చారు. దీనికి చిన్న శస్తచ్రికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. చిన్న శస్తచ్రికిత్స చేసిన తరువాత బిడ్డను తల్లికి అప్పగించారు. అర్థగంట తరువాత బాలిక విపరీతంగా ఏడుస్తుండడంతో వైద్యులకు తెలిపారు. ఓ పెయిన్ కిల్లర్ జంక్షన్ ఇస్తే ఊరుకుంటుందని డాక్టరు చెప్పగా అలాగే అన్నారు. ఇంక్షన్ చేశాక చిన్నారిలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మళ్లీ డాక్టర్‌కు తెలిపారు. వెంటనే చిన్నారిని ఐసీయూలోకి తీసుకెళ్లి అబ్జర్వేషన్‌లో ఉంచారని ఆమె అంకుల్ మనీష్ కుమార్ తెలిపారు.
గంట తరువాత ఐసీయూ నుంచి బయటకొచ్చిన డాక్టర్లు బాలిక చనిపోయిందని చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మెడికల్ సూపరింటిండెంట్ దృష్టికి తీసుకెళ్లే ఇంజక్షన్ వికటించడం వల్లే బాలిక మృతి చెందిందని చెప్పి చేతులు దులుపుకొన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె చనిపోయిందంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా 2015 సంవత్సరంలో జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అస్సాంకు చెందిన 36 ఏళ్ల మహిళ అనామిక రే బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శస్తచ్రికిత్స చేస్తుండగానే మృతి చెందడం అప్పట్లో సంచలనం అయింది.