జాతీయ వార్తలు

‘పద్మావత్’పై సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 20: హిందీ చలనచిత్రం ‘పద్మావత్’పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని సుప్రీం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారాల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రాజస్థాన్ హోం, న్యాయశాఖల మంత్రి గులాబ్‌చంద్ కటారియా శనివారం తెలిపారు. ఈ పిటిషన్‌లో భాగస్వామిగా చేరాలని ఆయన ‘కర్ణిసేన’ నేతలకు పిలుపునిచ్చారు. ‘పద్మావతి’ విడుదలైతే కొన్ని వర్గాల వారు ఆందోళనలు చేస్తారని, ఫలితంగా శాంతి భద్రతలు విషమిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
కర్ణిసేనకు భన్సాలీ ఆహ్వానం
వివాదాస్పద హిందీ చలనచిత్రం ‘పద్మావత్’ను చూసేందుకు రావాలంటూ ఆ సినిమా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ‘శ్రీ రాజపుత్ కర్ణిసేన’ నాయకులకు ఆహ్వానం పంపారు. రాజ్‌పుత్‌ల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మించిన ఈ సినిమాను అడ్డుకుంటామని కర్ణిసేన హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 25న సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా, వివాదాన్ని చల్లార్చేందుకు భన్సాలీ కర్ణిసేనకు ఆహ్వానం పంపారు. కాగా, ఆహ్వానం పంపడం కేవలం డ్రామా అని, భన్సాలీకి చిత్తశుద్ధి లేదని కర్ణిసేన, రాజ్‌పుత్ సభాభవన్ నేతలు ఆరోపించారు. ఏ రోజు రావాలో చెప్పకుండా ఆహ్వానం పంపడంలో నిజాయితీ లేదని కర్ణిసేన నేత లోకేంద్రసింగ్ కల్వీ విమర్శించారు. రిపబ్లిక్ దినోత్సవంపై గౌరవం ఉన్నందున తాము బంద్‌కు పిలుపు ఇవ్వలేదని, అయితే థియేటర్ల వద్ద ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.
గుజరాత్‌లో కొన్ని మల్టీప్లెక్స్‌ల వెనుకంజ
గుజరాత్‌లో ‘పద్మావత్’ను ప్రదర్శించేందుకు కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు వెనుకంజ వేశాయి. ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరికల నేపథ్యంలో థియేటర్ల యజమానులు ఈ సినిమాపై అసక్తి చూపడం లేదు. ఏ ఒక్క థియేటర్‌లో ప్రదర్శించినా తాము సహించేది లేదని కర్ణిసేన సౌరాష్ట్ర విభాగం హెచ్చరించింది. గుజరాత్‌లోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.