జాతీయ వార్తలు

ప్రిన్సిపాల్‌ను కాల్చి చంపిన విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యమునానగర్, జనవరి 20: చదువుకు నిలయాలైన విద్యాలయాల్లో ఇటీవలి కాలంలో క్రైమ్ థిల్లర్‌ను తలపించే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే శనివారం హర్యానాలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. 12వ క్లాసు చదువుతున్న ఓ కుర్రాడు ఏకంగా తుపాకీతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌నే కాల్చి చంపాడు. యమునానగర్‌లోని స్వామి వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ రీతు చాబ్రాపై పాయింట్ 32 బోర్ గాన్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన రీతు చాబ్రాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందారు. మధ్యాహ్నం 11.30 నుండి 12.00 గంటల సమయంలో పాఠశాల కార్యాలయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. పిల్లవాడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇలావుండగా 15 రోజులుగా హర్యానాలో శాంతి భద్రతల సమస్య ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తోంది. రోజూ ఏదో ఒకచోట అసాంఘిక సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రతిపక్షాలు అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

చిత్రం..రీతు చాబ్రా