జాతీయ వార్తలు

అమర జవాన్లకు విజయగీతిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భద్రతాదళ సిబ్బంది కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ‘్భరత్ కే వీర్’ పేరిట ఇప్పటికే ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఓ అధికారిక గీతాన్ని శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. గాయకుడు కైలాష్ ఖేర్ ఈ గీతాన్ని ఆలపించి సంగీతం అందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హన్సరాజ్ అహిర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, హిందీ నటుడు అక్షయ్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతావిష్కరణ సందర్భంగా అక్షయ్‌కుమార్, కైలాష్ ఖేర్‌తో పాటు కొంతమంది కార్పొరేట్ రంగ ప్రముఖుల నుంచి 12.93 కోట్ల రూపాయల మేరకు విరాళాలు సేకరించారు. భద్రతాదళాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీతాన్ని ఇష్టపడేవారందరూ ఈ గీతాన్ని డౌన్‌లోడ్ చేసుకుని వినాలని, ఈ పాటను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా వసూలయ్యే మొత్తాన్ని ‘భారత్ కే వీర్’ నిధిలో జమ చేస్తామని గాయకుడు కైలాష్ తెలిపారు. ఈ గీతాన్ని సంగీతప్రియులందరూ మెచ్చుకునేలా కైలాష్ ఆలపించారని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. విధి నిర్వహణలో అమరులైన భద్రతాదళాల సిబ్బంది కుటుంబాలను ఆదుకునేందు గత ఏడాది ఏప్రిల్‌లో ‘్భరత్ కే వీర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన వారి కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. నిధి కోసం ఎంత మొత్తాన్ని సేకరించినా తక్కువేనని, అమర జవాన్ల ప్రాణాలను డబ్బుతో వెల కట్టలేమని ఆయన అన్నారు. సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు నటుడు అక్షయ్‌కుమార్ చొరవ చూపడాన్ని రాజ్‌నాథ్ అభినందించారు. ఆధారం కోల్పోయిన సైనికుల కుటుంబాలకు కోటి రూపాయల మేరకు సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ క్రమంలోనే ‘్భరత్ కే వీర్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించామన్నారు.
దాల్మియా భారత్ గ్రూప్ ఈ గీతావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సైనికులకు సంబంధించి అనురాగ్ అగర్వాల్ రూపొందించిన అమర్ చిత్ర కథ గ్రాఫిక్ నవలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సైనికులు, వారి కుటుంబాల నేపథ్యంలో చిత్రీకరించిన లఘు చిత్రాన్ని విడుదల చేశారు. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నటుడు అక్షయ్‌కుమార్ పిలుపునిచ్చారు. 13 కోట్ల రూపాయల మేరకు విరాళాలు సేకరించి అందజేస్తామని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా తెలిపారు.