జాతీయ వార్తలు

కొత్త సీఈసీ ప్రకాశ్ రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఓంప్రకాష్ రావత్ ఈ నెల 23న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 64 సంవత్సరాల రావత్ ప్రస్తుత సిఇసి హాచెల్‌కుమార్ జోతి స్థానే ఈ బాధ్యతలు చేపడతారు. 2015 ఆగస్టులో ఎన్నికల కమిషనర్‌గా రావత్ పదవిని చేపట్టారు. గతంలో కేంద్ర, రాష్ట్రాల్లో అనేక కీలక పదవులు నిర్వహించారు. 1994లో దక్షిణాఫ్రికాలో జరిగిన జాతి వివక్ష అనంతర తొలి ఎన్నికలకు ఐక్యరాజ్యసమితి పరిశీలకుడిగా రావత్ వెళ్ళారు. కాగా రావత్ స్థానే ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాస ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన రావత్ 1993లో తొలిసారిగా రక్షణ మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 2010లో అత్యుత్తమ సేవలకు గాను ప్రధానమంత్రి అవార్డును ఆయన పొందారు.