జాతీయ వార్తలు

పారదర్శకంగా కేసుల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో నలుగురు సీనియర్ జడ్జీలకు విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విచారించాల్సిన కేసుల కేటాయింపులకు సంబంధించి ఓ స్పష్టమైన విధానం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అత్యంత సునిశితమైన ప్రజాహిత పిటిషన్లను న్యాయమూర్తులకు కేటాయించే విషయంలో పారదర్శకతను పెంపొందించేలా ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావచ్చునని తెలుస్తోంది. ముఖ్యంగా తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న నలుగురు సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన వివాదాస్పద అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాహిత పిటిషన్లను కేటాయించే విషయంలో ఈ తాజా ఆలోచనను తెరపైకి తెచ్చినట్లుగా చెబుతున్నారు. నలుగురు న్యాయమూర్తులు ప్రస్తావించిన అన్ని అంశాలను ప్రధాన న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారని చెప్పడానికి తాజాగా దీపక్ మిశ్రా తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలన్న రెండు పిటిషన్లను సీజే సారథ్యంలోని బెంచ్‌కే కేటాయించడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించిన పిటిషన్లు సోమవారం విచారణకు వస్తాయి. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి మిశ్రా సహ న్యాయమూర్తులతో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారని, అలాగే సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ స్పష్టమైన, నిర్దిష్టమైన కేసుల కేటాయింపు వ్యవస్థను అమలులోకి తెచ్చే అవకాశాలు బలపడుతున్నాయని తెలుస్తోంది. కేసుల కేటాయింపులకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి తీసుకునే నిర్ణయాలను సుప్రీం కోర్టు రిజిస్ట్రీ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఆ విధంగా ఎవరు ఏ కేసును విచారిస్తున్నారన్నది ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుందని అభిజ్ఞ వర్గాల కథనం. కేసుల కేటాయింపులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఉన్నట్లుగా రోస్టర్ వ్యవస్థను అనుసరించాలన్న డిమాండ్ దీర్ఘకాలంగా వినిపిస్తోందని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు పనితీరును మెరుగుపరిచేందుకు తమకిందిన సూచనలను, సలహాలను దీపక్ మిశ్రా అమలు చేసే అవకాశం ఉందని, ఆ విధంగా న్యాయమూర్తులతో తనకు తలెత్తిన విభేదాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సింగ్ తెలిపారు. ఒకే రకమైన కేసులను కేటాయించేందుకు ఓ స్పష్టమైన వ్యవస్థ ఢిల్లీ హైకోర్టుతోపాటు బోంబే హైకోర్టులోనూ అమలవుతోందని ఆయన తెలిపారు. కాగా న్యాయవ్యవస్థలో తలెత్తిన సంక్షోభాన్ని సామరస్యపూర్వక ధోరణిలో ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై కాబోయే ప్రధాన న్యాయమూర్తులతోపాటు కొందరు న్యాయమూర్తులు దీపక్ మిశ్రాతో చర్చలు జరుపుతున్నారని సన్నిహిత వర్గాలు వివరించాయి. వీరిలో ఎస్‌ఏ బాబ్డే, ఎన్‌వీ రమణ, యూయూ లలిత్, డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు.