జాతీయ వార్తలు

జుడిత్‌ను రప్పించేందుకు కేంద్రం విస్తృత ప్రయత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 12: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని తైమానీ ప్రాంతంలో అపహరణకు గురైన జుడిత్ డిసౌజాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోందని ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. ‘జుడిత్ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ)తోపాటు కేంద్ర ప్రభుత్వం మాతో విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు విదేశీ వ్యవహారాల శాఖ పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది. మా సోదరిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. జుడిత్ పనిచేస్తున్న సంస్థతో మేము కూడా మాట్లాడాం’ అని బాధితురాలి సోదరుడు జెరోమ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. జుడిత్‌ను రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలేమిటో అధికారులు మీకు తెలియజేశారా? అన్న ప్రశ్నకు జెరోమ్ సమాధానమిస్తూ, ఇవన్నీ అధికారిక వ్యవహారాలు అయినందున వీటిని బహిర్గతం చేయకూడదని, కనుక ఈ విషయం గురించి ప్రభుత్వం తమకు వివరించలేదని చెప్పాడు. ఇదిలావుంటే, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కోల్‌కతాలో జుడిత్ కుటుంబ సభ్యులను కలిశారు. జుడిత్‌ను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆమె వారికి ధైర్యం చెప్పారు.

చిత్రం జుడిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తున్న సిపిఎం నేత సీతారాం ఏచూరి తదితరులు