జాతీయ వార్తలు

ఆసియాన్ దేశాధినేతల రాకతో ‘యాక్ట్ ఈస్ట్’కు సమగ్ర రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఈ నెల 26న ఇక్కడ జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు పదిమంది ‘ఆసియాన్’ దేశాధినేతలు హాజరవుతున్నందున భారత్ సంకల్పించిన ‘యాక్ట్ ఈస్ట్ విధానాని’కి సమగ్ర రూపం వస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీ కంటోనె్మంట్‌లో ఎన్‌సిసి రిపబ్లిక్ డే శిబిరాన్ని సోమవారం సందర్శించిన సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘యాక్ట్ ఈస్ట్ విధానం’ సమగ్ర రూపు దాల్చాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమని ఆమె అన్నారు. ఆసియాన్ దేశాల అధినేతల పర్యటన సందర్భంగా ‘యాక్ట్ ఈస్ట్’పై ఫలవంతమైన చర్చలు జరిగే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడంపై విలేఖరులు ప్రశ్నించగా- ‘ఎన్‌సిసి శిబిరం, రిపబ్లిక్ డే వేడుకలపై ఇపుడు దృష్టి పెడదాం’ అని ఆమె ముక్తసరిగా అన్నారు. అంతకుముందు ఆమె ఎన్‌సిసి కేడెట్లకు ‘రక్షణ మంత్రి పతకం’తో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. రక్షణ మంత్రి పతకాన్ని 1989లో ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్‌సిసి కేడెట్ ప్రియకు ఈ గౌరవం దక్కింది. ఎన్‌సిసి కేడెట్లు క్రమశిక్షణతో శిబిరంలో పాల్గొన్నారని ఆమె ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ కార్యక్రమాలు, స్వచ్ఛ్భారత్, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ కేడెట్లు భాగస్వామ్యం కావడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 లక్షల మంది ఎన్‌సిసిలో కేడెట్లుగా ఉన్నారని, 2022 నాటికి ఈ సంఖ్యను 15 లక్షలకు పెంచుతామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో 703 మంది బాలికలు సహా 2,070 మంది ఎన్‌సిసి కేడెట్లు పాల్గొంటున్నారు. కేడెట్ల శిక్షణ శిబిరం ఈ నెల 28న జరిగే ర్యాలీతో ముగుస్తుంది.

చిత్రాలు..ఢిల్లీ కంటోనె్మంట్‌లో సోమవారం ఎన్‌సీసీ రిపబ్లిక్ డే శిబిరాన్ని సందర్శించి, కేడెట్ల గౌరవ వందనం స్వీకరిస్తున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్