జాతీయ వార్తలు

బాల కార్మికులకు రూ.25వేల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 12: బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటపడిన బాల కార్మికులకు సరయిన పునరావాసం కల్పించడంతోపాటు వారి బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం ఇక్కడ ‘చైల్డ్ లేబర్ ట్రాకింగ్ సిస్టమ్’ను ప్రారంభించారు. అధికార యంత్రాంగం కాపాడిన ప్రతి బాల కార్మికునికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25వేల చొప్పున అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటపడిన వారు సమర్పించిన ‘చార్టర్ ఆఫ్ డిమాండ్స్’ను సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్పారు. పిల్లల డిమాండ్లను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.