జాతీయ వార్తలు

ఆధార్ నెంబరిస్తే నష్టమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ఆధార్‌ను అనేక అంశాలతో ముడిపెట్టిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తున్నవారికి సుప్రీం కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఆధార్ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణ సందర్భంగా అనేక కీలక విషయాలను తెరమీదకు తెచ్చింది. ప్రస్తుత నెట్‌వర్క్ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రైవేటు కంపెనీలకు అందుబాటులో ఉన్నాయని ఒక వ్యక్తి ఆధార్ వివరాలు ఇతరులకు అందుబాటులో ఉంటే వచ్చే తేడా ఏమిటి? అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ పిటిషన్లను విచారించింది. పౌరుల వ్యక్తిగత వివరాలు ప్రైవేటు కంపెనీలకు అందుబాటులో ఉన్నాయని అలాంటప్పుడు ఆధార్ నంబర్ ఇవ్వడం వల్ల నష్టమేమిటని పిటిషనర్లను ప్రశ్నించింది. పౌరులు నెట్‌వర్క్ సమ్మిళితమైన ప్రపంచంలో జీవిస్తున్నారని రాజ్యాగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించిన బయోమెట్రిక్ సమాచారాన్ని కేంద్రీయ టేటాబేస్‌లో నిక్షిప్తం చేశారని, ఈ నేపథ్యంలో గుర్తింపు అవసరాల కోసమే పౌరులు 12 అంకెల ఆధార్ నంబర్ ఇవ్వాల్సి వస్తోందని న్యాయమూర్తులు ఏకే సిక్రీ, ఎఎం ఖన్వీకర్, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్‌తో కూడిన బెంచ్ పిటిషనర్లను ప్రశ్నించింది. ఈ సందర్భంగా మాట్లాడిన న్యాయవాది దివాన్ ఆధార్ నమోదు బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించారని వారు సేకరించిన ఈ వివరాలకు భద్రత ఏమిటని ప్రశ్నించారు.
ఆధార్ నమోదులో పాలుపంచుకున్న 49వేల ప్రైవేటు ఏజెన్సీలకు గత ఏడాది ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని, ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత భద్రత ఏమిటన్న ఆందోళన మొదలైందని అన్నారు. ప్రభుత్వం తరఫున ఏ ప్రతినిధి లేకుండానే ప్రైవేటు ఏజన్సీలు ఈ వివరాలు సేకరించాయని కోర్టుకు తెలిపారు.