జాతీయ వార్తలు

హామీలన్నీ అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రత్యేక హోదాసహా విభజన హామీలన్నీ నెరవేరిస్తేనే పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో శాసనసభ స్థానాల పెంపునకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన అనంతరం మొదటిసారి ఆంధ్రా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజుతో కలిసి ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగత అంశాలు, పరిస్థితులను రాహుల్ గాంధీకి వివరించినట్టు చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన పోలవరం యాత్ర గురించి రాహుల్‌కు తెలిపినట్టు వివరించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, విభజన హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో 184 నిబంధన కింద విభజన హామీల అమలు అంశంపై చర్చకు నోటీసు ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై లోక్‌సభలో ప్రస్తావించే అంశంపై కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గేని సంప్రదించి రాహుల్ సలహాలు, సూచనలు ఇచ్చినట్టు చెప్పారు. ఏపీ విభజన హామీలను గాలికొదిలేసి శాసనసభ సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రత్యేక హోదాతోసహా విభజన హామీలన్నీ అమలు చేస్తేనే పార్లమెంట్‌లో సీట్ల పెంపు ప్రతిపాదనకు సహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో విభజన హామీల అమలుకు మిత్రపక్షాలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నప్పడు విభజన హామీల అమలుపై ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని రాహుల్ సూచించారని వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై అంశాలవారీగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు.

చిత్రం..ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న రఘువీరా