జాతీయ వార్తలు

అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: సంజయ్ బన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇంతకు ముందు తాము ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడి ఉన్నట్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం మంగళవారంనాడు స్పష్టం చేసింది. పద్మావత్ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసుకోడానికి సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 18 గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గుజరాత్, రాజస్థాన్‌సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ నెల 25న చిత్రం విడుదల చేసుకునేలా బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో మార్పులు చేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేశాయి. రెండు రాష్ట్రాల పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు‘ ఇంతకు ముందు మేం ఇచ్చిన ఆదేశాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. దానికి కట్టుబడి ఉండాలి. శాంతి భద్రతలు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే’ అంటూ జస్టిస్ ఎఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ‘పద్మావత్ విడుదలకు సంబంధించి గతంలో మేం ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులూ ఉండవు’ అని బెంచ్ తేల్చిచెప్పింది. ‘మా ఆదేశాలను పాటించాల్సిందే’నంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు తెలిపింది. అలాగే శ్రీ రాష్ట్రీయ కర్ణిసేన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. కర్ణిసేనతోపాటు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ సంజయ్‌లీలా బన్సానీ చిత్రం విడుదలయ్యే అన్ని థియేటర్ల ఎదుట బైఠాయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ రూపాల్లో రెండు సంస్థలూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. బాలివుడ్ నటి దీపక్ పదుకొనే హీరోయిన్‌గా నటించిన పద్మావత్ చిత్రం విడుదలపై పలు రాష్ట్రాల్లో నిషేధించారు. చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర ప్రదర్శన, ప్రేక్షకుల భద్రత, థియేటర్ల వద్ద బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అందరూ రాజ్యాంగానికి లోబడే నడచుకోవాలని ధర్మాసనం పేర్కొంది.

చిత్రం.మంగళవారం ముంబయిలోని సిద్ధివినాయక స్వామిని దర్శించుకున్న దీపికా పదుకొనే. శుక్రవారం ఆమె నటించిన పద్మావత్ విడుదలవుతున్న విషయం తెలిసిందే.