జాతీయ వార్తలు

గణతంత్ర వేడుకల్లో ఘనతలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: సైనిక పాటవం, దేశ సంస్కృతి, వైవిధ్యం వంటి అంశాలతోపాటు ఈ నెల 26న ఇక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా ఎన్నో ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్‌పథ్ వద్ద ‘ఆసియాన్’ పతాకం గగన వీధిలో తొలిసారిగా ఎగరబోతోంది. ‘ఆసియాన్’లోని పది సభ్య దేశాలకు చెందిన అధినేతలు ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు అతిథులుగా హాజరవుతున్నారు. బీఎస్‌ఎఫ్‌లోని మహిళా మోటార్‌సైకిల్ రెజిమెంట్ ఆధ్వర్యంలో సాహసకృత్యాలు ఆహూతులను అలరించబోతున్నాయి. అయిదు ‘ఎంఐ-17వీ5’ హెలికాప్టర్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోని విశేషాలను తెలిపేలా ‘ఆకాశవాణి’ పలు శకటాలను ఏర్పాటు చేస్తోంది. ఆదాయపు పన్ను శాఖ కూడా వినూత్నరీతిలో శకటాన్ని ఏర్పాటు చేస్తోంది. నేవీకి సంబంధించిన ఐఏసీ విక్రాంత్ నౌక, డిఆర్‌డివోకు చెందిన ‘నిర్భయ్’ క్షిపణి, అశ్విని రాడార్ సంస్థల నమూనాలను ప్రదర్శిస్తారు.

చిత్రాలు..మంగళవారం రాజ్‌పథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ ఫుల్‌డ్రెస్‌డ్ రిహార్సల్స్‌లో పాలుపంచుకున్న బ్రహ్మోస్ క్షిపణులు, బిఎస్‌ఎఫ్ మహిళల మోటార్ సైకిల్ విన్యాసాలు