జాతీయ వార్తలు

‘సుధర్మ’ సంస్కృత పత్రికను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: దేశం నుంచి వెలువడుతున్న ఒకే ఒక సంస్కృత దినపత్రిక నిధుల లేమితో సతమతమవుతోంది. ‘సుధర్మ’ పేరుతో మైసూరు నుంచి వెలువడుతున్న ఈ పత్రికకు ప్రస్తుతం 3000 కాపీల సర్క్యులేషన్ మాత్రమే ఉంది. సంవత్సర చందా రూ.400/- వసూలు చేస్తున్నప్పటికీ పత్రిక సర్క్యులేషన్ రోజురోజుకూ దిగజారిపోవడంతో, పత్రికను బత్రికించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖలు రాశామని ఆ పత్రిక ఎడిటర్ సంపత్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ వారి నుంచి సమాధానం లేకపోవడంతో ప్రజలనుంచి చందాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నామని ఆయన వివరించారు. పత్రిక చందాదారులతోపాటు శ్రేయోభిలాషులు అనేకమంది పత్రిక మనుగడకోసం అనేక సలహాలు సూచనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తికోసం 1970లో సంస్కృత పండితుడైన నదదూర్ వరదరాజ అయ్యంగార్ ఈ పత్రికను ప్రారంభించారు.