జాతీయ వార్తలు

ఒకే ఒక్క కట్‌తో ‘ఉడ్తా పంజాబ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: కేంద్ర సెన్సార్ బోర్డు (సిబిఎఫ్‌సి)తో వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సోమవారం తీర్పును వెలువరించిన హైకోర్టు కేవలం ఒకే ఒక్క (మూత్ర విసర్జన) దృశ్యాన్ని కత్తిరించి ఈ చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మాదకద్రవ్యాల సమస్యను కథాంశంగా తీసుకుని రూపొందించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రాన్ని 48 గంటల్లోగా సర్టిఫై చేసి నిర్మాతలు ఇంతకుముందు నిశ్చయించుకున్నట్లుగా 17వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు వీలు కల్పించాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. సినిమాలను సర్టిఫై చేసే విషయంలో సిబిఎఫ్‌సి అతిగా స్పందించడం సరికాదని, సెన్సార్ బోర్డు ‘ముసలమ్మ’లా వ్యవహరించకుండా వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా చిత్రాలను సెన్సార్ చేసే అధికారం సిబిఎఫ్‌సికి లేదని, అసలు సినిమాటోగ్రఫీ చట్టంలో ‘సెన్సార్’ అనే పదమే లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సినిమాల్లో ఏవైనా సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు చేసే సూచనలు రాజ్యాంగంతోపాటు గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులకు అనుగుణంగా ఉండి తీరాలని బాంబే హైకోర్టు పేర్కొంది. ‘ఉడ్తా పంజాబ్’ సినిమా స్క్రిప్టు దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నించే విధంగా ఉందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలన్న విషయం పూర్తిగా ఆ చిత్ర నిర్మాతల ఇష్టమేనని న్యాయస్థానం పేర్కొంది. ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంలో 89 సన్నివేశాలు అసభ్యకరంగానూ, అభ్యంతరకరంగానూ ఉన్నాయని, కనుక వాటిని తొలగించాలని పేర్కొంటూ సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఈ నెల 13వ తేదీన జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిలిమ్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ ఎస్‌సి.్ధర్మాధికారి, జస్టిస్ షాలినీ పన్సాల్కర్ జోషిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు పట్ల చిత్రపరిశ్రమ హర్షాన్ని వ్యక్తం చేసింది.