జాతీయ వార్తలు

కసరత్తు పూర్తయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెలాఖరులో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలిసింది. అయితే ఈ మార్పులు ఏ స్థాయిలో ఉంటాయనేది స్పష్టం కావడం లేదు. పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై నాలుగైదు నెలల నుంచే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ నిర్ణయానికి వచ్చారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి ఐదారుగురిని మంత్రివర్గంలో చేర్చుకోవచ్చుని తెలిసింది. కొందరు మంత్రుల శాఖలు కూడా మారుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోదీ ఇటీవల బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతోకలిసి ఢిల్లీలోని జెండేవాలాలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌తో భేటీ అయి మంత్రివర్గంలో చేయాలనుకుంటున్న మార్పులు, చేర్పుల గురించి చర్చించినట్లు చర్చించినట్టు తెలిసింది. దీనికి ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం ఆమోదం తెలిపిందని అంటున్నారు. ఇద్దరు సీనియర్ మంత్రులు, ఇద్దరు జూనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి నలుగురు కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చని అంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువ నాయకులను కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలిసింది. ఉత్తరాఖండ్ నుంచి ఒకరిని కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారనని అంటున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లాంటి సీనియర్ మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పు ఉండదు. కాగా పలువురు మంత్రుల పనితీరు పట్ల నరేంద్ర మోదీ అసంతృప్తితో ఉన్నారనీ, ఇదే విషయాన్ని అనేకసార్లు హెచ్చరించినా పనితీరు మార్పు రాలేదని అలాంటి వారి శాఖలు మార్చవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా వెళ్లిపోయినందున ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంది. అలాగే ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్ కొశియారీకి ఈ సారి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అంటున్నారు.