జాతీయ వార్తలు

కొండెక్కిన టమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: సాధారణంగా కిలో ఇరవై, ముప్ఫై రూపాయలు ఉండే సామాన్యుడి నిత్యావసర సరకుల్లో ఒకటైన టమోటా ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో 80నుంచి వందరూపాయల దాకా పలుకుతుండడంతోఏమి కొని తినాలని గృహిణులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు నెల చివరికి కానీ కొత్త పంట మార్కెట్లోకి వచ్చే అవకాశం లేనందున మరో రెండు నెలల పాటు టమోటా ధరలు ఎక్కువగానే ఉండే అవకాశముందని కేంద్రం అంటోంది. సాధారణంగా ప్రతి ఏటా ఆఫ్‌సీజన్ అయిన జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో టమోటా ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం టమోటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర కరవు కారణంగా పంట దెబ్బతినడంతో అవి మరింత కొండెక్కి కూచున్నాయి. ముఖ్యంగా గత 15 రోజుల్లో టమోటా ధరలు నింగినంటాయి. దేశవ్యాప్తంగా నాణ్యత, ప్రాంతాన్ని బట్టి కూరగాయల వ్యాపారులు కిలో 80నుంచి వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. ‘ప్రధానంగా టమోటా పండించే దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైన కరవు కారణంగా రబీ పంట దెబ్బతినడం వల్లనే ధరలు పెరిగి పోయాయి. సెప్టెంబర్‌లో మాత్రమే కొత్త పంట మార్కెట్లోకి రాదు. అందువల్ల ఈ రెండు నెలలు టమోటా ధరలు ఎక్కువగానే ఉండే అవకాశముంది’ అని కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

చిత్రం కూరగాయల ధరల పెరుగుదలను నిరసిస్తూ గురువారం ఢిల్లీలోని బిజెపి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు