జాతీయ వార్తలు

అమిత్ షా కొడుకు అవినీతిపై మాట్లాడరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌చూర్, ఫిబ్రవరి 12: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలకు పదునుపెట్టారు. ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ‘జన ఆశీర్వాద్ యాత్ర’ ప్రారంభించిన రాహుల్ గాంధీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జైషా అవినీతిపై మోదీ నోరు మెదపరేమని నిలదీశారు. అవినీతిపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని జైషా వ్యవహారంపై వౌనం దాల్చడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ‘అవినీతి గురించి మీరు మాట్లాడే ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి అవినీతిపై మాట్లాడండి. 80 కోట్ల రూపాయలు మూడు నెలల్లో అమాంతంగా 50వేల కోట్లకు ఎలా పెరిగిపోయాయి? ఆ చిట్కా ఏమిటీ మీరు ముందు ప్రజలు చెప్పి ఆనక అవినీతి గురించి మాట్లాడితే బావుటుంది’ అని రాహుల్ అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాకే అమిత్ షా కొడుకు జైషా అవినీతికి ఊడలు దిగిపోయిందని ఓ న్యూస్‌పోర్టల్ వెల్లడించింది. అయితే షా కుంభకోణాన్ని వెలికితీసిన పోర్టల్‌పై బీజేపీ అధినేత క్రిమినల్ కేసులు పెట్టారు. నాలుగు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనూహ్య ప్రజాస్పందన వస్తోంది. దీంతో బీజేపీ నేతలపై ఆయన విమర్శలకు పదునుపెట్టారు.
ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకునే కాంగ్రెస్ అధ్యక్షుడు దాడి తీవ్రత పెంచారు. ‘మోదీజీ మీ నాయకుడు బీఎస్ యెడ్యూరప్ప జైలుకెళ్లొచ్చిన పెద్దమనిషి. మరోపక్క నలుగురు మాజీ మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోయి జైలు దారిపట్టారు. మీ నాయకులే 11 మంది అవినీతి ఆరోపణలొచ్చి రాజీనామా చేశారు. మీరు వీటన్నింటి గురించి మాట్లాడిన తరువాతే అవినీతిపై నీతులు వల్లిస్తే మంచిది’ అని రాహుల్ నిప్పులు చెరిగారు. యువతకు ఉపాధి కల్పన, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. దేశంలోని అన్ని వర్గాలూ కష్టాలపాలయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం.. రాయ్‌చూర్‌లో సోమవారం రోడ్డుపక్కన ఓ బజ్జీల దుకాణంలో కర్నాటక ముఖ్యమంత్రి
సిద్దరామయ్య తదితర నేతలతో కలిసి మిర్చి బజ్జీలు తింటున్న రాహుల్ గాంధీ