జాతీయ వార్తలు

జనవరిలోనే పరార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం సూత్రధారి నీరవ్‌మోదీ ముందే సర్దుకున్నాడు. ఇందుకు సంబంధించి పిఎన్‌బి నుంచి సిబిఐకి ఫిర్యాదు రావడానికి ముందే అంటే జనవరి ఒకటినే దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన స్విస్‌లో ఉంటున్నట్టు అధికార వర్గాలు కూపీ లాగాయి. మరో పక్క ఈ భారీ కుంభకోణానికి బాధ్యులైన ఎవర్నీ వదిలేది లేదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, 11,400 కోట్ల రూపాయల కుంభకోణంపై అధికార, ప్రతిపక్షాలు భుజాలు తడుముకుంటున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మొదలైంది. బీజేపీ అందదండలతోనే కుంభకోణానికి సూత్రధారుడు నీరవ్ మోదీ దేశం విడిచివెళ్లిపోయాడని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రస్తు తం నీరవ్ స్విట్జర్లాండ్‌లో ఉన్నట్టు కేంద్ర హోమ్‌శాఖ వద్ద సమాచారం
ఉంది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం ఈనాటిది కాదని యూపీఏ ప్రభుత్వంలోనే దానికి బీజం పడిందని బీజేపీ తిప్పికొట్టింది.‘ఈ స్కామ్ యూపీఏ హయాంలోనే జరిగింది. దాన్ని అపట్లో బయటకు రాకుండా తొక్కిపెట్టారు. కచ్చితంగా యూపీఏ నిర్వాకమే. నిజం చెప్పాలంటే మేం దీన్ని బయటకు తీశాం. దోషులపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’అని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. మిలియనీర్ జువెలర్ నీరవ్ మోదీ వెనక ప్రధాని నరంద్ర మోదీ హస్తం ఉందని కుంభకోణం బయటపడ్డవెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బుధవారం సాయంత్రమే రాహుల్ ఎన్‌డీఏపై ముప్పేట విమర్శలు చేశారు. మోదీ నేతృత్వంలోనే లూటీ జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. మరోపక్క దేశంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కుంభకోణానికి సంబంధించి స్టాటస్ రిపోర్టు ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్ని బ్యాంకులను ఆదేశించారు. సత్యం కంప్యూటర్ తరువాత దేశంలోనే అతి పెద్ద కుంభకోణం పంజాబ్ నేషనల్ బ్యాంకుది.‘ఇది అత్యంత దారుణమైంది. కుంభకోణానికి సంబంధించి ఏ ఒక్కరు తప్పించుకోడానికి వీల్లేదు. ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందీ నిగ్గు తేల్చండి’అంటూ జైట్లీ అన్ని బ్యాంకులకు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. అలాగే అమాయకులను వేధింపులకు గురిచేయొద్దని ఆయన అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబయి శాఖలో 11,400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. బ్యాంకులో మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు సీబీఐకు ఫిర్యాదులు వచ్చాయి. ప్రముఖ వజ్రాల వ్యావారి నీరవ్ మోదీ, మరో ఆభరణాల కంపెనీ ఈ కుంభకోణానికి పాల్పడినట్టు సమాచారం అందడంతో దర్యాప్తునకు ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో సూత్రధారి నీరవ్ మోదీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడుందీ సరైన సమాచారం లేదు. అయితే నీరవ్ నివాసం, కార్యాలయాల్లో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. వ్యాపార సంస్థలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసినట్టు చెబుతున్నారు. నీరవ్ మోదీ దేశం విడిచివెళ్లిపోయారని అనధికార కథనాలు వినిపిస్తున్నాయి. సిట్జర్లాండ్‌లో వెళ్లిపోయినట్టు అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.