జాతీయ వార్తలు

జాప్యం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం విడుదల చేయవలసిన నిధుల గురించి చర్చించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై తెలంగాణాకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించనున్నారు. ‘ప్రధాన మంత్రి మోదీ అప్పాయింట్‌మెంట్ అడిగాను.అప్పాయింట్‌మెంట్ లభిస్తే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాల గురించి ఆయనతో చర్చిస్తాను. అది సాధ్యం కాని పక్షంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి చర్చలు జరుపుతా’నని చంద్రశేఖరరావు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు 2017-18 సంవత్సరానికి ఇవ్వవలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రశేఖరరావు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఏడున్నర గంటలకు జైట్లీని నార్త్ బ్లాక్‌లో కలుసుకుని ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా తొమ్మిది జిల్లాలకు వెనుకబడిన అభివృద్ధి నిధులు విడుదల చేయకపోవటం ఏమిటని ఆయన జైట్లీని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం చేయవలసి ఉన్నదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఈ సెక్షన్ ప్రకారం రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఆర్థిక సహాయం చేయాలని ప్రతిపాదించగా కేంద్రం తొమ్మిది జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి 2014-15 సంవత్సరానికి 450 కోట్లు, 2015-16కు 450 కోట్లు, 2016-17 సంవత్సరానికి 450 కోట్లు విడుదల చేసిందని ఆ వినతి పత్రంలో కేసీఆర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి సంబంధించిన 450 కోట్లను ఇంత వరకు విడుదల చేయకపోవటం తమకు విస్మయం కలిగిస్తోందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఉద్దేశించిన 450 కోట్లు విడుదల చేయకపోవటం తమకు అర్థం కావటం లేదన్నారు. ఈ నిధులను వీలున్నంత త్వరగా విడుదల చేయించాలని ఆర్థిక శాఖ మంత్రి కోరానన్నారు. రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఏర్పాటు చేస్తామంటూ గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కూడా గట్టిగా కోరినట్లు చంద్రశేఖరరావు సమావేశం తరువాత విలేఖరులతో చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఐఐఎమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశానన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పంట పెట్టుబడి పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ప్రశంసించారని చంద్రశేఖరరావు వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు ఎనిమిది వేల రూపాయల ఆర్థిక పథకానికి తాను అభిమానినని సుబ్రహ్మణ్యం చెప్పారని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే సోమవారం హైదరాబాదుకు వచ్చినప్పుడు ఈ పథకం గురించి సవివరంగా చర్చిస్తానని కూడా సుబ్రహ్మణ్యం సూచించారని, తన ఇంటికి భోజనానికి రావాలని ఆయన్ని ఆహ్వానించానని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రేపుకలిసే అవకాశాలున్నాయని చెప్పారు.