జాతీయ వార్తలు

తాడోపేడో తేలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఫిబ్రవరి 15: మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భోపాల్ బాధిత సంఘాలు ఏకమవుతున్నాయి. త్వరలో జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని భోపాల్ గ్యాస్ బాధిత సంఘాలు ప్రకటించాయి. భోపాల్ గ్యాస్ విషాద బాధితులకు పరిహారం ఇప్పించడం, వారి సమస్యలు పరిష్కరించడంతో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సంఘాలు ధ్వజమెత్తాయి. బాధితుల పక్షాన పోరాడుతున్న ఐదు సంఘాల నేతలు గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఉప ఎన్నికలు జరిగే మంగోయిల్, కొలారస్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఈనెలలోనే రెండుచోట్లా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. భోపాల్ దుర్ఘటన బాధితులను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని గ్యాస్ పీడిత మహిళ స్టేషనరీ కర్మచారి సంఘ్ అధ్యక్షురాలు రషీదాబీ విమర్శించారు. బీజేపీ నాయకులు ఇచ్చిన శుష్కవాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ఆమె ప్రకటించారు. ‘బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అధికారిక పత్రాలు ఉప ఎన్నికలు జరిగే రెండుచోట్లా విస్తృతంగా పంపిణీ చేస్తాం. ప్రభుత్వ మోసాన్ని ఎండగతాం’ అని ఆమె హెచ్చరించారు. ‘దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తాం. తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాటిపైనే ఓ కార్యచరణతో ముందుకెళ్తాం’ అని రషీదాబీ చెప్పారు.