జాతీయ వార్తలు

అస్సాంలో కూలిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొర్హాట్, ఫిబ్రవరి 15: అస్సాంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ మైక్రోలైట్ హెలికాప్టర్ కూలిపోయన ఘటనలో ఇద్దరు భారత వైమానిక దళ ఉద్యోగులు మృతి చెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా వెళ్తున్న వైరస్ ఎస్‌డబ్ల్యూ 80 చిన్న హెలికాప్టర్ కూలిపోయింది. జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి టైకాఫ్ తీసుకున్న తరువాత మధ్యాహ్నం సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. మృతులు ఇద్దరూ వైమానిక దళ వింగ్ కమాండర్లని వారన్నారు. సరిగ్గా ప్రమాదం సుమోయిమారి ఛాపోరి వద్ద జరిగినట్టు అధికారులు తెలిపారు. వింగ్ కమాండర్లు మజూలీ వెళ్తుండగా విమానం కుప్పకూలిపోయినట్టు నిర్ధారించారు. అయితే ప్రమాదానికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందలేదు. సాంకేతిక సమస్యవల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దుర్ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించారు.