జాతీయ వార్తలు

ఒక్క మహిళా నెగ్గలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల డిమాండ్ సంగతి ఏమోగానీ... నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడి 54 ఏళ్లయినా ఇప్పటివరకూ అసెంబ్లీకి ఒక్కరంటే ఒక్క మహిళ ఎన్నికవ్వలేదు. నాగాలాండ్ అసెంబ్లీకి 12సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 27 అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 3న ప్రకటిస్తారు. అరవై స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 195 మంది పోటీ చేస్తున్నారు. అందులో ఐదుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వెడెయి క్రోను, మంగ్యాన్‌పుల నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) తరఫున నిలబడుతున్నారు. దిమాపూర్-3, నొక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ట్యుయెన్‌సంగ్ సదర్-2 నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున రఖీలా పోటీలో ఉన్నారు. కొత్తగా ఆవిర్భవించిన నేషనలిస్టు డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ పార్టీ (ఎన్‌డీపీపీ) అబోయి సీటు నుంచి అవాన్ కొన్యాక్‌ను పోటీ చేయిస్తోంది. ఛిజామా నియోజకవర్గం నుంచి రేఖ రోజ్ దుక్రూ ఇండిపెండెంట్‌గా రంగంలో ఉన్నారు.
ఇలా ఉంటే అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) ఒక్క మహిళకు టికెట్ కేటాయించలేదు. మహిళలెవరూ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిచూపనందుకే టికెట్ ఇవ్వలేదని ఎన్‌పీఎఫ్ అధ్యక్షుడు షుర్‌హోజెలీ లీజెట్సు ఇటీవల పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో ఒక్క రఖీలా తప్ప మిగతా నలుగురూ రాజకీయాలకు కొత్తే. బీజేపీ అభ్యర్థిని రఖీలా భర్త లికుమాంగ్ మాజీ మంత్రి, అలాగే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2006లో ఆయన మృతి చెందారు. గత ఎన్నికల్లో ట్యుయెన్‌సంగ్ సదర్-2 నియోజవర్గం నుంచే పోటీచేసి కేవలం 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అవాన్ కొన్యాక్ ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె. ఆమె తండ్రి నెవాంగ్ కొన్యాక్ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవలే ఆయన మృతి చెందారు. రేఖారోజ్ డుక్రు మంచి పారిశ్రామికవేత్త. రాజకీయాల్లో ఆసక్తితో ఆమె ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఐదుగురు మహిళలను సామాజిక మాధ్యమాల్లో తమ ప్రచారాన్ని అప్పుడే మొదలెట్టేశారు. ఎన్నికల్లో మహిళల ప్రవేశాన్ని నాగాలాండ్ చీఫ్ ఎలక్షన్ అధికారి అభిజిత్ సిన్హా హర్షించారు.