జాతీయ వార్తలు

అది యూపీఏ పుణ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం యూపీఏ పుణ్యమేనని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్‌బీని ముంచేసిన వ్యవహారం కాంగ్రెస్ నేతలకు తెలిసే జరిగింది, అయితే ఇప్పుడు ఏమీ ఎరగనట్టు తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఎదురుదాడి చేశారు. 11,400కోట్ల రూపాయల కుంభకోణం కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ సంఘటన 2017లో జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు సీతారామన్ తోసిపుచ్చారు. నీరవ్ మోదీ ఎక్కడున్నా కేంద్రం వదలిపెట్టదని ఆమె పేర్కొన్నారు. ‘ఈ కుట్రలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే నిందితులు దేశం విడిచివెళ్లిపోవడానికి మేం ఎలాంటి సహకారం అందించలేదు. నిందితులు ఎక్కడున్నా ప్రభుత్వం వెతికి పట్టుకుంటుంది’ అని రక్షణ మంత్రి చెప్పారు. పీఎన్‌బీ వ్యవహారంలో కేంద్రంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు. నీరవ్ మోదీ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారని మంత్రి గుర్తుచేశారు. అలాగే గీతాంజలి వ్యవహారంపై 2013లోనే అలహాబాద్ బ్యాంకులోని ప్రభుత్వ డైరెక్టర్ లేవనెత్తిన అంశాన్నీ ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. మరోపక్క నీరవ్ కంపెనీల్లో సీబీఐ, ఈడీ సోదాలు కొనసాగుతునే ఉన్నాయి. 4,886 కోట్ల రూపాయలకు సంబంధించి సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 143 ఎల్‌ఓయూలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవన్నీ ఛోక్సీ-గీతాంజలి, నక్షత్ర, గిలి కంపెనీలకు ఇచ్చినట్టు తెలిసింది. 2017-18లో ఇది చోటుచేసుకుంది.

చిత్రం..ఢిల్లీలో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్