జాతీయ వార్తలు

చదువులో రాణిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: దేశంలో చదువుకుంటూ మధ్యలోనే ఆపేస్తున్న వారిలో ముస్లిం బాలికలు 72 శాతం కంటే ఎక్కువగానే ఉన్నారని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ శనివారం ఇక్కడ తెలిపారు. బీజేపీ మహారాష్ట్ర మోర్చా నిర్వహించిన ఒక కార్యక్రమంలో నఖ్వీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు మధ్యలోనే మానేస్తున్న పిల్లల్లో ముస్లింలే ఎక్కువగా ఉన్నారని, దాన్ని అరికట్టేందేకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. చదువుపట్ల వారిలో చైతన్యం కలిగించడంతోపాటు ఆర్థికంగా సహాయపడేలా కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోని అక్షరాస్యులతో పోల్చుకుంటే, అందులో ముస్లిం మైనారిటీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని నఖ్వీ అన్నారు. గత మూడేళ్లలో 2.42 కోట్ల మంది మైనారిటీ విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్‌షిప్‌లను అందజేయడం జరిగిందని, ఈ ఏడాది మరో 1.5 కోట్ల మందికి అదనంగా స్కాలర్‌షిప్‌లను అందించే ఏర్పాటు జరుగుతోందని, ఇలాంటి పథకాల ద్వారా ముస్లింలలో చదువు పట్ల శ్రద్ధ పెంచే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. బేగమ్ హజ్రత్ మహల్ బాలికల స్కాలర్‌షిప్పులకోసం మూడు లక్షల పైచిలుకు దరఖాస్తులు అందాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి అనేక కార్యక్రమాలతో మింగుడు పడని కాంగ్రెస్ నేతలు లేనిపోని విమర్శలకు దిగుతున్నారని అన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు, ఆ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ‘చాంపియన్ ఆఫ్ కరప్షన్’ (కాంగ్రెస్ నేతలు) ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.