జాతీయ వార్తలు

ఇలా పోగేసి.. అలా పోగొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: జాతీయ బ్యాంకుల నుండి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను దోచుకున్న నీరవ్ మోదీ, ఐపీఎల్ కుంభకోణం మూల పురుషుడు లలిత్ మోదీ దేశం విడిచి పారిపోవటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా సహాయం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో నీరవ్‌మోదీ కుంభకోణం ప్రారంభమైందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను రాహుల్ ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బ్యాంకు కుంభకోణాలకు బాధ్యత తీసుకోకపోవటం సిగ్గు చేటని అన్నారు. ప్రజల డబ్బు తీసుకుని బ్యాంకింగ్ రంగంలోకి మోదీ తరలిస్తూంటే ఆయన క్రోనీ పెట్టుబడిదారులు ఈ డబ్బును బ్యాంకుల నుండి దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
నీరవ్‌మోదీతో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. ‘పెద్ద నోట్లను రద్దు చేయటం ద్వారా ప్రజల డబ్బును బ్యాంకుల్లో మోదీ పెట్టారు. ఇప్పుడది దోపిడికి గురైంది’ అని రాహుల్ తీవ్ర స్వరంతో అన్నారు. పెద్ద, పెద్ద పదవుల్లో ఉన్న వారి మద్దతు ఉన్నందుకే ఇలాంటి కుంభకోణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోదీ ఈ కుంభకోణాలపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.