జాతీయ వార్తలు

వివాహ వేడుకలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్మీర్, ఫిబ్రవరి 17: ఒక వివాహ వేడుకలో గ్యాస్ సిలెండర్ పేలి ఆరుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బీవార్ పట్టణంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజ్మీర్ జిల్లా బీవార్‌లోని ఒక హోటల్‌లో వివాహ వేడుకలో హఠాత్తుగా సిలెండర్ పేలడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. వేడుకకు హాజరైనవారిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ హోటల్‌కు ఆనుకుని ఉన్న మరికొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నాయి.