జాతీయ వార్తలు

నీరవ్ మోదీ బీజేపీ భాగస్వామే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: పంజాబ్ నేషనల్ బ్యాంకులో తలెత్తిన 11వేల కోట్ల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి నీరవ్ మోదీ, బీజేపీకి చిరకాల భాగస్వామి అని శివసేన ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధిస్తూ బీజేపీ ఎన్నికల నిధుల సేకరణలో నీరవ్ ఎలా సహాయపడ్డాడో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. దేశంలో అవినీతికి చరమగీతం పాడుతామంటూ ఎన్డీయే చేస్తున్న ప్రకటనలు ఉత్తుత్తివేనన్న విషయాన్ని ఈ కుంభకోణం రుజువు చేస్తోందని దుయ్యబట్టింది. ఎన్డీయే మిత్రపక్షమైన ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ‘నేను తినను, తిననివ్వను’ అంటూ మోదీ చేస్తున్న ఎన్నికల ప్రకటనలు ఉత్తర కుమార ప్రగల్పాలేనని ఎద్దేవా చేసింది. కుంభకోణం వెలుగు చూసిన తరువాత అయినా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మేహుల్ చోస్కికి సంబంధించి సంస్థల్లో వేగంగా ఎందుకు సోదాలు చేపట్టలేదని ప్రశ్నించింది. దర్యాప్తు సారాంశాన్ని బట్టి నీరవ్ మోదీ గత జనవరిలోనే దేశం దాటేసినట్టు తెలుస్తోందని, అయితే, కొద్దిరోజుల క్రితం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సరసన నీరవ్ ఉండటాన్ని చూస్తే బీజేపీతో ఆయన బంధుత్వం ఎంత బలమైనదో స్పష్టంగా అర్థమవుతోందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది. భారీ కుంభకోణానికి సూత్రధారి నీరవ్ సమయం చూసి దేశం దాటేయడంలో బీజేపీ సహకారం ఎంతైనా ఉందని అనుమానించింది. పార్టీ సంపదను బలోపేతం చేయడానికి, అధికార పీఠంపై కూర్చోబెట్టగల ఓట్లు రాబట్టేందుకు బీజేపీ చేతిలో చాలామందే నీరవ్‌లు ఉన్నారని ఆగ్రహించింది. మోదీ ఎన్నికల నినాదం ‘తినను- తిననివ్వను’ అన్నది అబద్ధమేనన్న విషయం పీఎన్బీ కుంభకోణంతో తేలిపోయిందని పార్టీ తన స్వరాన్ని వినిపించింది. నీరవ్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలై ఉన్నపుడు, ఇతర పారిశ్రామికవేత్తలతో కలిసి నీరవ్ దావోస్‌లో మోదీని ఎలా కలిశారని శివసేన ప్రశ్నించింది.