జాతీయ వార్తలు

అవినీతిలో అగ్రతాంబూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూర్, ఫిబ్రవరి 19: కర్నాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతిమయంగా ఉందని, రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వంలో కుంభకోణాలే కుంభకోణాలని అవినీతి అభియోగాలు రోజువారీగానే వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన బిజెపి ర్యాలీనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రతి పనికి పది శాతం కమిషన్ తీసుకుంటున్నారని నేను ఆరోపించిన తర్వాత నాకు ఎన్నో ఫోన్లు వచ్చాయి. రాష్ట్రంలో నడుస్తున్నది పది శాతం కమిషన్ కాదు, ఇంకా చాలా ఎక్కువే’ అని చెప్పినట్లు మోదీ తెలిపారు. సిద్దరామయ్య ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్న మోదీ ‘మీకు కమిషన్ల ప్రభుత్వం కావాలా? బలమైన దృక్పథంతో అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం కావాలా?’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన జరిగిన ర్యాలీలో కూడా సిద్దరామయ్య ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు గుప్పించిన మోదీ అవినీతిలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోందని కూడా ఆయనపై ఆగ్రహించిన విషయం తెలిసిందే. అంతేకాదు, సిద్దరామయ్య ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కూడా మోదీ అన్నారు. ఆ తర్వాత తాజాగా నేడు జరిగిన ర్యాలీలో మరింతగా స్వర తీవ్రతను పెంచిన మోదీ, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అధికారమే పరమావధిగా పనిచేస్తుందని ప్రజల ఆశలు, ఆకాంక్షలతో దానికి ఎంతమాత్రం నిమిత్తం ఉండదని అన్నారు. త్వరితగతిన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అవరోధాలుగా మారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు, నాయకులపై కొత్త ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, కొత్త కుంభకోణాలు తలెత్తుతున్నాయని పేర్కొన్న మోదీ ఇంత జరుగుతున్నా సిద్దరామయ్య ప్రభుత్వం ఏమి చేస్తోందంటూ ఆయన సొంత జిల్లా మైసూరులో జరిగిన ర్యాలీలో నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే పదేపదే ప్రచారం చేస్తోందని పేర్కొన్న మోదీ ‘కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న మీరు ఏమి చేశారు?’ అని ఆ పార్టీ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పదే పదే అబద్ధాలను ప్రచారం చేయడం వల్ల ప్రజలు వాటినే నమ్ముతారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని, కానీ తెలివైన ప్రజలు వారి అబద్ధాలను ఎంతమాత్రం విశ్వసించే పరిస్థితులు ఉండవని మోదీ తెలిపారు. 6,400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బెంగళూరు, మైసూరు 117 కి.మీ. ఆరులైన్ల జాతీయ రహదారి ప్రాజెక్టును ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. అలాగే మైసూరులో 800 కోట్ల రూపాయల పెట్టుబడితో అంతర్జాతీయ ప్రమాణాలతో శాటిలైట్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తామని కూడా అన్నారు.

చిత్రాలు..శ్రావణబెళగొలలో నిర్వహిస్తున్న బాహుబలి మహామస్తకాభిషేకానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలుకుతున్న పురోహితుడు
*మైసూరు-ఉదయ్‌పూర్‌ల మధ్య నడిచే ప్యాలెస్ క్వీన్ హమ్‌సఫర్ ఎక్‌స్రపెస్ రైలును మైసూరు స్టేషన్‌లో ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ