జాతీయ వార్తలు

ఓటర్ల జాబితాలో అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జాబితాల్లోంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి, డీకే అరుణ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓం ప్రకాశ్ రావత్‌ను కలిశారు. అనంతరం శశిథర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో ఓటర్ల సవరణపై అధ్యయనం చేయగా పెద్దఎత్తున ఓట్లు తొలగించినట్టు వెల్లడైందని అన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల సవరణ సక్రమంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఓటర్ల సవరణపై ఈ నెల 14న డ్రాఫ్ట్ లిస్ట్‌ను అందజేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటికీ ఆ ప్రక్రియను పూర్తిచేయలేదని అన్నారు. ప్రస్తుతం ఓటర్ల సవరణ గడువు వచ్చే మార్చి 24 తేదీనాటికి ముగుస్తుందని, దాన్ని మరో నెల రోజులపాటు పొడిగించాలని కేంద్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. వచ్చే ఆగస్టులో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఓట్లు తొలగింపు అభ్యర్థుల గెలుపు ఓటములపైన తీవ్ర ప్రభావం చూపుతుందని ఈసీకి చెప్పినట్టు ఆయన అన్నారు. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు తండాలకు చెందిన 700 ఓట్లును తొలగించారని ఆయన తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి 18 ఓట్ల తేడాతో గెలిచారని ఆయన వెల్లడించారు. ఆ తండాలలో ఎందుకు ఓటర్ల తొలిగింపు జరిగిందని వివరణ అడిగితే, ఆధార్‌తో అనుసంధానం కాలేదని సమాధానం ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల సవరణ సరిగా జరగడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం తొలగించిన ఓట్ల లిస్టును గ్రామ పంచాయతీలో నోటీసు బోర్టులో పెడితే ఆ వివరాలను గ్రామస్థులు తెలుసుకొనే అవకాశం ఉందని తెలిపారు.

చిత్రం..సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి బయటకు వస్తున్న టి.కాంగ్రెస్ నేతలు