జాతీయ వార్తలు

ఫ్రాంచైజీలనూ వదల్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ చోక్సీ ఇచ్చిన భారీ ఝలక్‌లో నష్టపోయింది పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇతర ప్రభుత్వరంగ రుణ సంస్థలు మాత్రమే కాదట. దర్యాప్తులో కేసును తవ్వుతున్నకొద్దీ వెలుగు చూస్తున్న కొత్త నిజాలు విస్మయానే్న కలిగిస్తున్నాయని దర్యాప్తు అధికారులే అంటున్నారు. తాజా దర్యాప్తు సమాచారం ప్రకారం 2013 -2017 మధ్యకాలంలో రెండు డజన్ల కంపెనీలు, 18మంది వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ జ్యువెలరీ బ్రాండ్ ప్రాంచైజ్‌లు తీసుకుని నిండా మునిగిపోయారని తెలుస్తోంది. ప్రాంచైజ్‌లు తీసుకున్న 18 సంస్థలు, వ్యాపారులు నష్టపోయిన మొత్తం సొమ్ము 20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. నీరవ్, చోక్సీల అవినీతి కుంభకోణంలో దారుణంగా నష్టపోయిన 18 సంస్థలు, కొందరు వ్యాపారులు క్రిమినల్ ఫిర్యాదులు చేసినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. చోక్సీ నిర్వహించిన బ్రాండెడ్ జ్యువెలరీ షోరూమ్స్ గీతాంజలి, గిలి సంస్థల ప్రాంచైజ్‌లను దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఆగ్రా, మీరట్, బెంగళూరు వంటి ప్రధాన పట్టణాల్లో కొన్ని సంస్థలు, వ్యాపారులు నెలకొల్పినట్టు తెలుస్తోంది.
దీంతో చోక్సీ సంస్థలపై కుట్రపూరిత నేరం, మోసం, ఒప్పందాల ఉల్లంఘనల కింద ఫిర్యాదుల చేయడంతో, ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు చెబుతున్నారు.