జాతీయ వార్తలు

భారత్‌ను చూసి నేర్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ, తదితర నగరాల్లో తీసుకుంటున్న చర్యలను ఐరాస ప్రశంసించింది. కాలుష్యంపై భారత్ సమర్ధవంతంగా పోరాడుతోందని ఐక్యరాజ్యసమితి పర్యావవరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఈడీ ఇరిక్ సొహెమ్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలు ప్రపంచానికే ఆదర్శంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అని, పర్యావరణ పరిరక్షణకు చూపుతున్న శ్రద్ధ మిగతా దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఇరిక్ పేర్కొన్నారు. ‘కాలుష్యంపై భారత్ చేస్తున్న పోరాటం అమోఘం. దీని వల్ల ఒక్క భారత్‌కే కాదు అనేక దేశాలకు మేలు జరుగుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అనుసరించే విధానాలు ప్రపంచానే్న ప్రభావితం చేస్తాయి’ అని ఐఎన్‌ఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పారు. ‘ముఖ్యంగా న్యూఢిల్లీ, తదితర నగరాల్లో వాయుకాలుష్యం నిరోధానికి అనేక చర్యలు చేపట్టారు. కాలుష్యంపై పోరాడే అనేక దేశాలకు ఇది స్ఫూర్తిదాయకం’ అని ఆయన స్పష్టం చేశారు. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం జడలువిప్పింది. పౌరులతోపాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి భారత్-ఐరాస మధ్య ఓ ఒడంబడిక జరిగింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి సీకే మిశ్రా, ఐఎన్‌ఈపీ ఈడీ ఇరిక్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భగా ఈడీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అనేక అంతర్జాతీయ వేదికలపై పర్యావరణ పరిరక్షణపై ప్రస్తావిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ను చూసి నేర్చుకోవాలని తెలిపారు. కాగా దేశంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర మంత్రి హర్షవర్దన్ వివరించారు.

చిత్రం..ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన యాంటీ స్మాగ్‌గన్.
సోమవారం దీనిని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రాన్ హుస్సేన్ ప్రారంభించారు.