జాతీయ వార్తలు

‘చౌకీదార్’ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రజల సొమ్మును దోచుకుని విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంటే మన ‘కాపలాదారుడు’ ఎక్కడ దాక్కున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ట్వీట్ దాడి చేశారు. రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేస్తూ ‘మొదట లలిత్ మోదీ, తరువాత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, ఇప్పుడు నీరవ్ మోదీ.. ఇలా వరుసగా దేశంలోని సొమ్మును లూటీ చేసి విదేశాలకు చెక్కేస్తుంటే మన కాపలాదారుడు ఎక్కడ దాక్కున్నారు’ అని ఆయన ప్రశ్నించారు. ‘తినను- తిననీయను’ అంటూ ప్రగల్భాలు పలికే చౌకీదార్ ఎక్కడ? మన సాహెబ్ వౌనం వెనక ఉన్న రహస్యం ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రజలు అసహనంతో ఎదురు చూస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ‘ఆయన ఎవరికి విశ్వాసపాత్రుడో ఆయన వౌనమే అరిచి, అరిచి చెబుతోంది’ అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరీక్షలో ఎలా పాస్ కావాలి, ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటూ పిల్లలకు రెండు గంటలపాటు లెక్చర్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో జరిగిన 22వేల కోట్ల రూపాయల బ్యాంకింగ్ కుంభకోణం గురించి కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు ఎందుకని రాహుల్ గాంధీ నిలదీశారు. దేశంలోని ప్రతి వ్యక్తీ కుంభకోణాల గురించి మాట్లాడుతుంటే మన ‘చౌకీదారు’ వౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటనని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు ‘మోదీ రాబ్స్ ఇండియా’ అనే ట్యాగ్‌ను తగిలించారు. పీఎన్‌బీలో జరిగిన భారీ కుంభకోణానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రివర్గాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ఇంతటి కుంభకోణం జరిగిదంటే దీని వెనుక దేశంలోని చాలామంది పెద్దల హస్తం ఉండి ఉంటుందని ఆయన అనుమానం వెలిబుచ్చారు.