జాతీయ వార్తలు

నూతన ఆవిష్కరణల కేంద్రంగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,్ఫబ్రవరి 19: నూతన ఆవిష్కరణల కేంద్రంగా భారత్ ఎదిగిందని, ప్రపంచం భారత్‌వైపు చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఆధునిక విప్లవం, ఐటీ పరిశ్రమ, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన సమాచార సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, పారిశ్రామిక వేత్తల మధ్య సమన్వయానికి ఉద్ధేశించిన డబ్లుసీఐటీ ఇండియా -2018 సదస్సు, నాస్కామ్ ఐఎల్‌ఎఫ్ 2018 సదస్సు ఒకే ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ సదస్సుకు కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర ఐటి మంత్రి కేటీ రామారావు, సద్గురు జగ్గీవాసుదేవన్, హానీవెల్ డేవిడ్ ఎం కొట్, ఎమర్సన్ అధినేత ఎడ్వర్స్ ఎల్ మాన్సర్, అడోబ్ అధినేత శాంతను నారాయణ, కోర్సుఎరా అధినేత అండ్రూ ఎన్‌జి, కార్నెల్ అధినేత సౌమిత్ర దత్త సహా 200 మంది హేమాహేమీలైన ఐటీ దిగ్గజాలు హాజరయ్యారు.
సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తూ ఇది ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు, నూతన ఆవిష్కర్తలు, ఆలోచనాపరులు, ఇంకా సంబంధిత ఇతర వర్గాల వారికి పరస్పరం ప్రయోజనకారి కాగలదని అన్నారు. భారత్ ప్రాచీన , సుసంపన్నమైన వైవిధ్య భరితమైన సంస్కృతులకు పుట్టునిల్లు, ఏకత్వభావన భారతదేశంలో అంతర్నిహితమై ఉందని పేర్కొన్నారు. వసుదైక కుటుంబం - ప్రపంచం అంతా ఒకే పరివారం అనే భావన భారత తత్వంలో లోతుగా పాతుకుపోయిందని, ఇది సమ్మిళిత సంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. ఈ భావనను 21వ శతాబ్దంలో మరింతగా పెంపొందించేందుకు సాంకేతిక విజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. పరస్పర సహకారానికి భౌగోళిక దూరాలు ఇక ఎంత మాత్రం అడ్డుగోడ కాబోవని అన్నారు. సృజనశీలురైన పారిశ్రామికవేత్తలను, నూతన ఆవిష్కరణలను, ప్రవర్ధమానమవుతున్న మార్కెట్‌ను మనం కలిగి ఉన్నామని, దేశంలో లక్షకు పైగా పల్లెలు ఆప్టికల్ ఫైబర్‌తో ముడిపడి ఉన్నాయని, 121 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని, 50 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. డిజిటల్ శక్తి కలిగి ఉండటం అంటే అందరినీ డిజిటల్ రంగంలోకి సమ్మిళితం చేయడమేనని అన్నారు. డిజిటల్ ఇండియా కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోలేదని, అది ఓ జీవన విధానంగా, ప్రజాజీవనంలో విడదీయరానిదిగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఇటీవలి డిజిటల్ విప్లవంతో పెరిగిన లావాదేవీల లెక్కలను వివరించారు. మూడు నెలల క్రితం ప్రారంభమైన ఉమాంగ్ యాప్ ద్వారా 185 ప్రభుత్వ సేవలు అందుతున్నాయని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో 2.8 లక్షల సర్వీసెస్ సెంటర్లు ప్రజలకు అనేక డిజిటల్ సేవలను అందిస్తున్నాయని అన్నారు. ప్రతి కుటుంబం డిజిటల్ అక్షరాస్యత సాధించేందుకు ప్రధానమంత్రి రూరల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను పరిచయం చేశామని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఉన్నామని, సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజాహితతం కోసం చక్కగా వినియోగించినట్టయితే అది మానవజాతికి చిరకాలం సమృద్ధిని అందించగలుగుతుందని అన్నారు. అంతే కాదు, మన భూగోళానికి సుస్థిరమైన భవిష్యత్‌ను కూడా అందిస్తుందని అన్నారు. పౌరులకు నైపుణ్యాలను అందించడం చాలా ముఖ్యమని, యువతకు ప్రకాశవంతమైన భవిష్యత్‌కు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్‌ను ప్రారంభించామని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ ఇ మార్కెట్‌లకు నేషనల్ ప్రోక్యూర్‌మెంట్ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్రారంభించామని తెలిపారు. అటల్ థింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని వెల్లడించారు. తొలుత ప్రధానిని నాస్కామ్ చైర్మన్ రామన్ రాయ్, ఎఐఎల్‌ఎఫ్ చైర్ సిపి గుర్నాని, విట్సా చైర్ యున్ని చియు, నాస్కామ్ వైస్ చైర్మన్ రిషాద్ ప్రేజీ, అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్‌లు స్వాగతం పలికారు. కాగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌ను ఆహ్వానించినట్టు నిర్వాహకులు తెలిపారు.