జాతీయ వార్తలు

అధికారులకు ‘డిజిటల్’ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: డిజిటల్ చెల్లింపులతోసహా కేంద్ర ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసిన ఉన్నతాధికారులకు త్వరలో ‘ప్రధానమంత్రి అవార్డు’లను ప్రదానం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులకు వచ్చే ఏప్రిల్‌లో జరిగే సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏప్రిల్ 20న ఆ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రభుత్వ పరిపాలనాశాఖలో అత్యుత్తమ సేవలు అందించిందుకుగాను ఇచ్చే ప్రైమ్ మినిస్టర్స్ అవార్డుకోసం దేశం నలుమూలల నుంచి ఇప్పటికే 2010 దరఖాస్తులు వచ్చాయని, వీటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాయని కేంద్రప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏటా జరిగే ఈ ఒక రోజు కార్యక్రమంలో ప్రజాసేవ, విధి నిర్వహణకు సివిల్ సర్వీసు అధికారులు పునరంకితం అవుతూంటారు. ఈసారి ప్రత్యేకంగా ‘ప్రధానమంత్రి అవార్డు’లను ప్రదానం చేయనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపికలో నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్ అండ్ రూరల్, దీన్‌దయాళ్ గ్రామీణ్ కౌశాలయ యోజన వంటి పథకాలను అమలు చేసిన తీరును పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలోని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలలోని 626 జిల్లాల నుంచి 2010 దరఖాస్తులు వచ్చాయని కేంద్రప్రభుత్వ ప్రజాసంక్షేమ, పరిపాలనా శాఖ పేర్కొంది.