జాతీయ వార్తలు

59 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, ఫిబ్రవరి 22: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 59 శాతం మంది కోటీశ్వరులే. ఈనెల 27న నాగాలాండ్ శాసభ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అందరికంటే జేడీయూ అభ్యర్థి రమోంగో లోథా అత్యంత సంపన్నుడు. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా ఆయన ఆస్తులు 38.92 కోట్లని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ఎన్నికల్లో మొత్తం 196 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో 193 అఫిడవిట్లు పరిశీలించగా 114 మంది కోటీశ్వరులే. యూత్‌నెట్ నాగాలాండ్ నేత హెకానీ జఖ్లూ గురువారం ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలు తెలిపారు. రాష్ట్రంలో యూత్‌నెట్ నాగాలండ్ ఓ ప్రముఖ సంస్థగా వెలుగొందుతోంది. ముగ్గురు అభ్యర్థులు అఫిడవిట్‌లో అసంపూర్తిగా వివరాలు అందించినట్టు సీఈవో తెలిపారని జబ్లూ వెల్లడించారు. అత్యంత సంపన్న అభ్యర్థి రమోంగో లోథా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని చెప్పారు. ఆయనకు 22,81,960 రూపాయల చరాస్తులు, 38,69,40,000 కోట్లు స్థిరాస్తులున్నట్టు ఏడీఆర్ పేర్కొంది. ఈ లెక్కన లోథా మొత్తం ఆస్తులు 38 కోట్ల 92 లక్షల రూపాయలుగా తేలింది. వొఖా జిల్లాలోని సనీస్ నియోజవర్గం నుంచి జేడీయూ టికెట్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. ఇక ఆప్ టికెట్‌పై ఘస్పానీ-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అకవీ ఎన్ ఝిమోమీ అఫిడవిట్‌లో చర, స్థిరాస్తులు ఏమీ లేవని చూపారు. పెరెన్ నుంచి పోటీలో ఉన్న ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్(ఎన్‌పీఎఫ్) ఆస్తులు 3.52 కోట్లు. అలాగే మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్‌డీపీపీ అభ్యర్థి నిఫియూ రియో ఆస్తులు 15.37 కోట్లు. ఆయన అగ్మయి-2 నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మరోమాజీ సీఎం కేఎల్ ఛిషీ ఎన్నికల అఫిడవిట్‌లో 38.20 కోట్లుగా చూపారు. అభ్యర్థులందరికన్నా అప్పులు ఎక్కువ చూపింది ఆయనే. తనకు 89 లక్షల రూపాయల అప్పులున్నట్టు ఛిషీ పేర్కొన్నారు. అయితే టీ నగాంపై, ఛింకై కోన్యా, కే కికో కోన్యాక్ ఆస్తులు అత్యల్పం అని జఖ్లూ వివరించారు. ఫోంచింగ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగాంపై ఆస్తులు ఐదువేలు. తెహోక్ నుంచి ఎన్‌పీఎఫ్ టికెట్‌పై పోటీ చేస్తున్న కోన్యా ఆస్తులు పదివేలు. మోకా నియోజకవర్గ ఎన్‌డీపీపీ అభ్యర్థి కికో కోన్యాక్ ఆస్తులు 20వేలు. ముగ్గురు అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. ముగ్గురు అభ్యర్థులు నిరక్షరాస్యులు, 16 మంది ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన వారున్నారు. ఐదుగురుకి డాక్టరేట్‌లున్నట్టు పరిశీలనలో తేలింది. 196 అభ్యర్థుల్లో ఏడుగురు మాత్రమే 25-30 మధ్య వయస్కులు. 29 మంది 31-40 ఏళ్ల మధ్య వయస్కులు. మిగతా వారంతా 40 ఏళ్లు పైబడినవారేనని ఏడీఆర్ వివరించింది.