జాతీయ వార్తలు

ఆరోగ్య భారత్ మా లక్ష్యం: నఖ్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఫిబ్రవరి 22: ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు గురువారం ఇక్కడ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ (నవీకరణ) చేపట్టామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సంస్థలను నవీకరించడంతోపాటు వాటికి అవసరమైన వౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోందని నఖ్వీ వెల్లడించారు. ఇక్కడి శాంతిగిరి ఆశ్రమంలో వార్షిక ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి ‘సంప్రదాయ భారత వైద్య విధానం మన వారసత్వ సంపద’ అన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందని మంత్రి తెలిపారు.