జాతీయ వార్తలు

భారత్‌కే భూటాన్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సరిహద్దుల్లో చైనాతో ఏర్పడిన డోక్లాం వివాదంలో భూటాన్, భారత్‌కే మద్దతుగా నిలిచిందని ప్రభుత్వ ఉన్నతాధికారులు పార్లమెటరీ సంఘానికి స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన డోక్లాం ప్రతిష్ఠంభనను ఆగస్టులో పరిష్కరించుకున్న తరువాత ఆ ప్రాంతంలో చైనా బలగాల మొహరింపులు లేవని కూడా పునరుద్ఘాటించారు. డోక్లాం వివాదంపై ఏర్పడిన పార్లమెంటరీ సభాసంఘానికి విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, రక్షణశాఖ కార్యదర్శి సంజయ్ మిత్ర ఈ విషయాన్ని వివరించారు. ఈ వివాదంలో భూటాన్ భారత్‌కు గట్టి మద్దతునిచ్చిందని పేర్కొన్న అధికారులు ఇటీవల భారత సైనికదళాల ప్రధానాధికారి బిపిన్ రావత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, గోఖలే భూటాన్ సందర్శించిన విషయాన్ని సభాసంఘం దృష్టికి తీసుకువెళ్లారు. సభాసంఘం సభ్యులు అడిగిన ప్రశ్నలకు వీరు సమాధానమిచ్చారు. డోక్లాంలోని వివాదాస్పద భూమిని చైనాకు భూటాన్ ఇచ్చిందని, అందుకు ప్రతిగా మరో ప్రాంతంలో భూమిని పొందిందన్న సభాసంఘం సభ్యుల ప్రశ్నకు అధికారులు సమాధానం చెబుతూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. కాగా డోక్లాం వ్యవహారంలో చైనా లక్ష్యం ఏమిటని, ఈ ప్రాంతంలో ఘర్షణకు దిగడంలో ఆ దేశం ఆంతర్యం ఏమిటని ఈ సభాసంఘంలో సభ్యుడైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.