జాతీయ వార్తలు

మీకు తెలియకుండానే జరిగిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అథానీ, ఫిబ్రవరి 24: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ.11,400 కోట్ల కుంభకోణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. పీఎన్‌బీ కుంభకోణంలో కఠిన చర్యలు తప్పవన్న ప్రధాని మోదీ ప్రకటనను రాహుల్ ఎద్దేవా చేశారు. వేల కోట్ల డబ్బు బయటకు ఎలా వెళ్లిందో ముందు చెప్పండి అంటూ రాహుల్ ప్రధానిని నిలదీశారు. ‘అది 22వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఆ డబ్బంతా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కొట్టేసి విదేశాలకు చెక్కేశారు. మోదీజీ మాత్రం దీనిపై కఠిన చర్యలు అంటున్నారు’ అని కర్నాటకలోని అథానీ జరిగిన బహిరంగ సభలో రాహుల్ వ్యంగ్యోక్తులు విసిరారు. ‘చర్యలు తీసుకునే ముందు నీరవ్ భాగోతం మీకు తెలియకుండానే జరిగిందా?’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. పీఎన్‌బీలో స్కామ్ బయటపడ్డ తరువాత తొలిసారి శుక్రవారం ప్రధాని మోదీ స్పందించారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఉపేక్షించబోమని మోదీ అన్నారు. బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రకటనను ఎద్దేవా చేశారు. ప్రధాని, ఆర్థిక మంత్రికి తెలియకుండానే ఇదంతా జరిగిందా? అంటూ ఆయన నిప్పులు చెరిగారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైందని ఆరోపిస్తున్న ప్రధాని బీజేపీ నేత యెడ్యూరప్ప అవినీతికి పాల్పడి జైలుకెళ్లిన విషయంపై ఏం చెబుతారని నిలదీశారు. అవినీతిపై సుదీర్ఘ ప్రసంగాలు చేసే ప్రధాని రాఫెల్ యుద్ధ విమానాల డీల్ గురించి నోరు మెదపడం లేదని కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దుతో లక్షలాది కంపెనీలు దివాళా తీస్తే ఒక్క అమిత్ షా కొడుకు జైషా వ్యాపారం 80కోట్ల నుంచి 50,000 కోట్లకు ఎగబాకిందని రాహుల్ విరుచుకుపడ్డారు. దేశంలో ఏకవ్యక్తి పాలన సాగుతోందని, మంత్రులు సుష్మా స్వరాజ్ (విదేశాంగ), నితిన్ గడ్కారీ (రవాణా), రాజ్‌నాథ్ సింగ్ (హోమ్)కు పనిలేకుండాపోయిందని రాహుల్ సెటైర్లు వేశారు.
కుంభకోణాలపై నోరు విప్పండి
న్యూఢిల్లీ: దేశానికి కాపలాదారు (చౌకీదార్)గా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఇన్ని బ్యాంకు కుంభకోణాలు ఎందుకు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. కపిల్ సిబల్ శనివారం ఏఐసీసీలో కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ అత్యంత ఖరీదైన కాపలాదారుడుగా మారారంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. నరేంద్ర మోదీ కాపలాలో ఇటీవల దాదాపు రూ.21వేల కోట్ల విలువైన బ్యాంకు కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. యూపిఏ ప్రభుత్వంపై 2జీ కుంభకోణం ఆరోపణలు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ప్రతిరోజూ ఒక ఆరోపణ చేసేవాడు. దేశాన్ని దోచుకున్నారంటూ దుమ్మెత్తిపోసేవారు. బ్యాంకుల కుంభకోణంపై వారిప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని కపిల్ సిబల్ నిలదీశారు. అన్ని బ్యాంకుల స్విఫ్ట్ బ్యాంకింగ్ విధానాన్ని 30 రోజుల్లో కోర్ బ్యాంకింగ్ విధానంతో అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు దేశ ప్రజలకు హామీ ఇవ్వాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన స్విఫ్ట్ సందేశాలు నిజంగా వ్యాపార లావాదేవీలకు జరిగినవా లేదా అనేది అధ్యయనం చేసి కుంభకోణాలేమైనా జరిగాయా అనేది తెలుసుకోవాలన్నారు. రిజర్వు బ్యాంక్ అన్ని స్వీఫ్ట్ సందేశాల ఫోరెన్సిక్ ఆడిట్ ఆరు నెలల్లో పూర్తిచేయాలని కపిల్ సిబల్ చెప్పారు. బ్యాంకుల్లోకి ప్రజల డబ్బు వెళుతోంది, ఈ డబ్బును ఎవరైనా దుర్వినియోగం చేసి ధనవంతులైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ధనికులు కుంభకోణాలతో తీసుకుపోయిన ధనాన్ని వెనక్కు తీసుకురావాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకం అవుతుందన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ గాడితప్పితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆయన హెచ్చరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ప్రభుత్వ ప్రతినిధి ఎవరు? అతనికి ఈ మోసగాళ్లతో ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రభుత్వ ప్రతినిధి అమృత్‌సర్ నుంచి పోటీ చేయలేదా అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. అవినీతిని అదుపు చేస్తానని చెప్పుకునే ప్రధాన మంత్రి లోక్‌పాల్‌ను ఎందుకు నియమించటం లేదని ప్రశ్నించారు.

చిత్రం..కర్నాటకలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం విజయపురిలో
రోడ్డుపక్కన ఓ టీస్టాల్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులతో కలిసి టీ తాగుతున్న దృశ్యం