జాతీయ వార్తలు

మరణం వెనుక మిస్టరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/ దుబాయ్, ఫిబ్రవరి 26: క్షణానికో మలుపు..ఎడతెగని ఉత్కంఠ..ప్రఖ్యాత నటి శ్రీదేవి ఆకస్మిక మరణం పెను మిస్టరీగా మారింది. మొత్తం వ్యవహారం నాటకీయ మలుపుతిరిగింది. ఇప్పటికే భారత్‌కు చేరాల్సిన ఆమె పార్థివ శరీరం ఆగిపోయింది. ఒకదాని తర్వాత ఒకటిగా శ్రీదేవి మరణంపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకూ గుండె పోటు వల్లే శ్రీదేవి మరణించిందన్న కథనాలనే నమ్మిన భారత ప్రజలకు దుబాయి పోలీసులు అందించిన ఫోరెన్సిక్ నివేదికతో హతాశులయ్యారు. శ్రీదేవి స్మృహ కోల్పోయి బాత్ టబ్‌లో పడి మరణించారని ఆ నివేదిక తెలిపింది. ఆమె ఎందుకు స్మృహ కోల్పోయారన్న దానిపై ఎలాంటి వివరణ ఇవ్వక పోయినా దుబాయి పత్రికల్లో మాత్రం శ్రీదేవీ శరీరంలో మద్యం సేవించిన ఆనవాళ్లున్నాయంటూ కధనాలు వెలువడ్డాయి. దాంతో ఆమె మరణంపై తిరిగి దర్యాప్తు మొదలైంది. శ్రీదేవి భర్త బోనీకపూర్, ఇద్దరు వైద్యులు, హోటల్ సిబ్బందిని అధికారులు తదుపరి సమాచారం కోసం కొన్ని గంటల పాటు విచారించారు. బోనీ కపూర్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ పూర్తయ్యే వరకూ దుబాయిలోనే ఉండాలని ఆయన్ని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పోస్టుమార్టం పరీక్షల్లో శ్రీదేవి మద్యం మత్తులో ఉన్న విషయం నిర్థారితం కావడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క శ్రీదేవిని కడసారి చూసేందుకు ముంబయిలోని ఆమె ఇంటికి ఇటు బాలీవుడ్ నటీనటులు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు ఆమె ఇంటికి చేరుకున్నారు. శ్రీదేవి మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు దుబాయిలోని భారత అధికారులు, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి పొద్దుపోయే వరకూ పడిగాపులు కాసారు. ఫోరెన్సిక్ నివేదికతో కధ మొదటికి రావడంతో ప్రాసిక్యూషన్ మెజిస్ట్రేట్ అనుమతి లభించే వరకూ మృత దేహాన్ని అప్పగించలేమని పోలీసులు స్పష్టం చేశారు. మిస్టరీ పూర్తిగా వీడే వరకూ శ్రీదేవి మృత దేహాన్ని అప్పగించడంలో తామేమీ చేయలేమన్న సంకేతాలను బలంగానే అందించారు. ఫోరెన్సిక్ నివేదిక ముందు వరకూ ఢిల్లీ ఈ కేసును చూసిన దుబాయి పోలీసులు శ్రీదేవి మరణించింది గుండె పోటువల్ల కాదని తేలడంతో తదుపరి దర్యాప్తును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. ఇలాంటి అనుమానాస్పద కేసులు ఎప్పుడు తలెత్తినా దుబాయిలో ఇదే తరహాలో భిన్నకోణాల్లో విచారణ జరుగుతుందని చెబుతున్నారు. గుండె పోటు వల్లే శ్రీదేవి మరణించారని మొదట వెల్లడించిన ఆమె కుటుంబ సభ్యులు అంతకు మించి ఎలాంటి వివరాలనూ వెల్లడించలేదు. ‘మేము దుఃఖంలో మునిగిపోయాం..మమ్మల్ని ప్రశ్నలతో వేధించవవద్దు’అని మీడియాకు స్పప్టం వారు స్పష్టం చేశారు. ‘మద్యం మత్తులోనే శ్రీదేవి స్పృహ కోల్పోయింది.దాంతో బాత్‌టబ్‌లో పడి మరణించింది’అని గల్ఫ్ న్యూస్ పత్రిక పేర్కొన్నప్పటికీ దానికి ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. అయితే శ్రీదేవి ఇంటిపేరు, పాస్‌పోర్టు నెంబర్‌తో కూడిన ఫోరెన్సిక్ నివేదిక కాపీని ఈ పత్రిక ట్విటర్‌లో అందించింది. గుండె పోటు వల్ల శ్రీదేవి మరణించిందన్న ప్రస్తావన ఈ నివేదికలో లేకపోవడంతో అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నదానిపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని, ఆమె భౌతిక కాయం చెడిపోకుండా ఎబామింగ్ (రసాయన పూత) చేస్తున్నారని అధికార వర్గాల్ని ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. తన మేనల్లుడి వివాహం పూర్తయిన తర్వాత కూడా శ్రీదేవి దుబాయి హోటల్‌లోనే ఉండిపోయారని,తన రెండో కుమార్తె ఖుషితో ముంబయి వచ్చేసిన బోనీకపూర్ తన భార్యకు ‘సర్‌ప్రైజ్ డిన్నర్’ఇవ్వడానికి మళ్లీ దుబాయి వచ్చాడని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. శ్రీదేవి బాత్‌రూమ్‌లోకి వెళ్లినప్పుడు ఆయన హోటల్ గదిలోనే ఉన్నారని, ఎంతకీ బయటికి రాకపోవడంతో లోపలికి వెళ్లి చూశాడని, బాత్‌టబ్‌లో పడి ఉన్న ఆమెను బోనీ కపూర్ ఆసుపత్రికి తరలించారని కూడా ఆ పత్రిక తెలిపింది.