జాతీయ వార్తలు

స్మార్ట్ సిటీగా కరీంనగర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల పథకం జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించింది. కరీంనగర్ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ఎంపీ వినోద్‌కుమార్ గురువారం ఇక్కడ పిలుపునిచ్చారు. ఆకర్షణీయ నగరాల (స్మార్ట్‌సిటీ) జాబితాలోకరీంనగర్‌కు స్థానం లభించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌కు స్థానం కల్పించాలని గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు కేంద్రం రెండు కోట్లు మంజూరు చేసిందని, త్వరలో కరీంనగర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి డిపిఆర్ సిద్ధం చేస్తామన్నారు.