జాతీయ వార్తలు

అవన్నీ తప్పుడు సాక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 18: దివంగత కాంగ్రెస్ ఎంపి ఎహ్‌సాన్ జాఫ్రీ జరిపిన కాల్పులు జనం రెచ్చిపోవడానికి కారణమైందంటూ గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై తీర్పు చెప్పిన ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలను మారణకాండలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు శనివారం ఖండించారు. కోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యంపై ఆధారపడి ఈ వ్యాఖ్యలు చేసిందని జాఫ్రీ కుమారుడు తన్వీర్ జాఫ్రీ అంటుండగా, కేవలం ఆత్మరక్షణ కోసమే జాఫ్రీ కాల్పులు జరిపారని ఈ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు అంటున్నారు. అసలు జాఫ్రీ కాల్పులే జరపలేదని ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పాడు. కోర్టులో సైతం అతను ఆదే విషయం చెప్పాడు. జాఫ్రీ జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారని, జనం రెచ్చిపోవడానికి అదే కారణమైందని ఈ కేసులో దోషులకు శిక్షలను ఖరారు చేస్తూ సిట్ ప్రత్యేక న్యాయమూర్తి పిబి దేశాయ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. అయితే జనం జరిపిన దారుణ మారణకాండకు అది ఎంతమాత్రం సాకు కాబోదని కూడా జడ్జి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలతో తాము ఏమాత్రం ఏకీభవించడం లేదని, కోర్టు కేవలం ఎవరో సాక్షి చెప్పిన మాటలపై ఆధారపడి ఈ వ్యాఖ్యలు చేసిందని, అది ఎంతమాత్రం నిజం కాదని తన్వీర్, మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు శనివారం అన్నారు. జాఫ్రీ తన తుపాకితో కాల్పులు జరపడాన్ని తాము చూశామని చెప్పిన ఒక్క సాక్షిని కూడా డిఫెన్స్ న్యాయవాది ప్రవేశపెట్టలేక పోయారని కూడా తన్వీర్ అన్నారు. జాఫ్రీ కాల్పులు జరపడాన్ని తాను చూశానని ఎవరో ఒక సాక్షి చెప్పిన దానిపై ఆదారపడి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని ఆయన అన్నారు.