జాతీయ వార్తలు

రాష్టప్రతి, ప్రధానికి ప్రత్యేక విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: వీవీఐపీలైన రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధానిల కోసం ప్రత్యేక విమానాలు సిద్ధమవుతున్నాయి. సరికొత్త ఆధునిక విమానాలు 2020నాటికి వినియోగంలోకి వస్తాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలనే ఎయిర్ ఇండియా బోయింగ్ 777-300 ఈఆర్‌లను కొనుగోలు చేశాయి. వీటిని వీఐపీలకు అనుగుణంగా మార్పు చేస్తారు. ప్రెస్‌కాన్ఫరెన్స్ రూమ్, అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా పేషంట్ ట్రాన్స్‌పోర్ట్ యూనిట్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. వైఫై సదుపాయం కలిగిన ఈ విమానాలు క్షిపణుల దాడులనూ తట్టుకోగలవు. బోయింగ్-777 విమానాలు, ప్రస్తుతం వినియోగిస్తున్న బోయింగ్- 747 విమానంకంటే ఎన్నో ఆధునిక సదుపాయాలు కలిగివున్నాయి. అదీకాకుండా ఇవి భారత్ నుంచి నేరుగా యుఎస్‌కు ఎక్కడా ఆగకుండా వెళ్లగలవు. ఇంధనం కోసం మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఎయిర్ ఇండియా మూడు బోయింగ్-777 విమానాలను ప్రవేశపెట్టింది. 2006లో 68 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. వీటిల్లో రెండు విమానాలను కేవలం వీవీఐపీల కోసమే కేటాయస్తారు. వీటిని ప్రభుత్వం
ఎయిర్ ఇండియా నుంచి కొనుగోలు చేస్తుందని సీనియర్ అధికారి తెలిపారు. దీనివల్ల ఇప్పటి మాదిరిగా ఎయిర్ ఇండియా తన విమానాల్లోంచి, వీవీఐపీల ప్రయాణం కోసం మార్పులు చేసిన విమానాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు వీలుగా గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,469.50 కోట్లు కేటాయించింది. ఎయిర్ ఇండియా మొత్తం 44 మంది పైలెట్లను వీవీఐపీ విమానాలను నడపడానికి వినియోగిస్తుంది.