జాతీయ వార్తలు

పోలియో రహిత దేశ హోదాకు ముప్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: పోలియో రహిత దేశాలుగా భారత్‌సహా సార్క్ దేశాల హోదాకు వచ్చిన ప్రమాదమేమీ లేదని, ఈ వ్యాధికి సంబంధించిన అవశేషాలు అరుదుగా కనిపించడం కొత్తేమీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) శనివారం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో పోలియో అనుమానంతో ఆరేళ్ల బాలికను ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రకటన చేసింది. ఈ వ్యాధిని కనుగొనడానికి ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు గట్టి నిఘా పెట్టి ఉన్న విషయాన్ని డబ్ల్యుహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంత కార్యాలయం గుర్తుచేస్తూ, 2011లో చివరిసారిగా కోల్‌కతాలో ఒక చిన్నారి పోలియో వైల్డ్ వైరస్ బారికి గురయిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క చిన్నారికి కూడా ఈ వ్యాధి సోకలేదని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ సంఘటనకు ముందు కూడా హైదరాబాద్‌లోని ఓ నాలానుంచి సేకరించిన శాంపిల్స్‌లో పోలియో వైరస్‌ను గుర్తించడం తెలిసిందే. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రి దీనిపై దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే.