జాతీయ వార్తలు

విశ్వాస పరీక్షలో రియో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, మార్చి 13: నాగాలాండ్‌లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీఫియూ రియో మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష విజయం సాధించారు. ఈ నెల 8న రియో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో రియోకు అనుకూలంగా 33 ఓట్లు, వ్యతిరేకంగా 26 ఓట్లు పడ్డాయి. ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. రియోకు అనుకూలంగా ఎన్‌డీపీపీకి చెందిన 17 మంది, బీజేపీకి చెందిన 12, ఎన్‌పీపీకి చెందిన ఇద్దరు, ఒక జెడీ(యూ), ఒక స్వతంత్య్ర అభ్యర్థి ఓటేశారు. ఇలావుండగా శాసనసభ స్పీకర్‌గా విఖో-ఓ యోషు ఎన్నికయ్యారు. యోషు గత మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉన్నారు. సదరన్ అంగామీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి 8న 34 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రియో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు మరో పది మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ నెల 16లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ పీబీ ఆచార్య ఆదేశించారు. దీంతో మంగళవారం అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో రియో విజయం సాధించారు.