జాతీయ వార్తలు

డ్యామ్‌లంటే ఎంత ప్రేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: మంత్రుల దగ్గర నుంచి అధికారుల వరకూ డ్యామ్‌లు నిర్మాణమంటే అమితానందం చూపిస్తారని, పరివాహక ప్రాంతాల అభివృద్ధి మాత్రం వారికి ఏమాత్రం శ్రద్ధ ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్యామ్‌ల నుంచి వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవడంపై మాత్రం వారికి ఏ మాత్రం శ్రద్ధ చూపరని ఆయన అన్నారు. సాగు అవసరాలకు సరిపడా నీరు ఇవ్వడంపైనే దృష్టి సారిస్తేనే నీటి పారుదల ప్రాజెక్టులు ఫలప్రదం అయినట్టని గడ్కరీ పేర్కొన్నారు. ‘డ్యామ్‌ల నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదు. నూటికి నూరుశాతం నీరు వ్యవసాయ అవసరాలు తీర్చాలి’అని ఆయన ఉద్ఘాటించారు.
సాగుకు నీరు సమృద్ధిగా అందితేనే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని ఆయన అన్నారు. డ్యామ్‌ల ద్వారా వచ్చే నీటిని కాలువలు, డ్రెయిన్ల ద్వారా పొలాలకు మళ్లిస్తే వ్యవసాయ రంగం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. ‘డ్యామ్‌ల నిర్మాణం అంటే అందరికీ అమితానందమే. ఎందుకంత ప్రేమో నాకు అర్థం కావడం లేదు. భారీ ప్రాజెక్టుల పట్ల మంత్రులు, అధికారులు విపరీతమైన మక్కువ. ఆనందం కట్టలు తెంచుకుంటుంది’ అని గడ్కరీ వ్యంగ్యోక్తులు విసిరారు. ‘కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (సీఏడీ) అభివృద్ధి చెందనప్పుడు ఎన్ని పెద్ద డ్యామ్‌లు నిర్మించినా ప్రయోజనం ఉండదు. ఇలా చెబుతున్నందుకు ఆయామ్ సారీ’ అని కేంద్ర జలవనరుల మంత్రి నిష్కర్షగా ప్రకటించారు.
నూటికి నూరు శాతం జలాలు సాగుకి ఉపయోగపడితేనే ఫలితం ఉంటుందని ఆయన అన్నారు. పంటలకు నీటిని అందించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులు అనుసరించాలని పిలుపునిచ్చారు. పైపులు, డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతుల ద్వారా వ్యవసాయ అవసరాలకు నీటిని సరఫరా చేయాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాజెక్టుల నిర్మాణంలో పొదుపు పాటించాలని ఆయన చెప్పారు.