జాతీయ వార్తలు

క్యాన్సర్‌పై ప్రచార యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మార్చి 13: ఈశాన్య రాష్ట్రాలలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజలను జాగృతం చేసేందుకు సుమారు 2,200 కిలో మీటర్ల దూరం జరుపనున్న తమ యాత్రను వైద్యుల బృందం, బైకర్లు ప్రారంభించారు. వీరు తమ యాత్ర పొడవునా వీధి నాటకాలు ప్రదర్శిస్తూ, ప్రజలతో చర్చలు జరుపుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజలను చైతన్యవంతం చేస్తారు. కచర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన 25 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో కూడిన బృందం, ‘సిల్చార్ థంపర్స్’ బైకింగ్ గ్రూపునకు చెందిన సభ్యులు అస్సాంలోని సిల్చార్ నుంచి సోమవారం తమ యాత్రను ప్రారంభించారు. టాటా ట్రస్టులు, కచర్ క్యాన్సర్ హాస్పిటల్, ఇతర సంస్థలతో కలిసి నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పాల్గొంటున్న సభ్యులు ఏడు ఈశాన్య రాష్ట్రాలలో పర్యటిస్తారు. ఈ యాత్ర షిల్లాంగ్, గౌహతి, తేజ్‌పూర్, ఇటానగర్, దిబ్రూగర్, కోహిమా, ఇంఫాల్, ఐజ్వాల్, అగర్తలా మీదుగా సాగి ఈ నెల 22న తిరిగి సిల్చార్‌లో ముగుస్తుంది. ‘క్యాన్సర్ రోగులకు వారి ఇళ్లకు సమీపంలోనే వారు భరించగలిగే వ్యయంలో నాణ్యమైన చికిత్స అందించాలనేది, క్యాన్సర్‌ను నిరోధించడం, త్వరగా గుర్తించడంపై ప్రజలను విస్తృతంగా చైతన్య పరచడం అనేది మా యాత్ర ప్రధాన ఉద్దేశం’ అని టాటా ట్రస్టుల మెడికల్ డైరెక్టర్ (క్యాన్సర్ కేర్ ప్రోగ్రాం) ఆర్నియే పురుషోత్తం చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో పొగాకు వినియోగం వల్ల ప్రజలు ఎక్కువగా వ్యాధులకు గురవుతున్నారని, తొలి దశలోనే గుర్తించడం వల్ల చాలామటుకు కేసులను నయం చేయవచ్చని ఆయన తెలిపారు.